Rape attempt on Georgia women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విదేశీ మహిళపై అత్యాచారయత్నం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. లితుయేనియా దేశానికి చెందిన మహిళపై యువకులు లైంగిక దాడికి యత్నించారు. యువకుల బారి నుంచి తప్పించుకున్న మహిళ భయంతో పరుగులు తీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. లితుయేనియా దేశానికి చెందిన ఓ మహిళ గోవా వెళ్లేందుకు శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకుంది. బెంగళూరు వెళ్తుండగా.. బస్సులో సదరు మహిళను.. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికుమార్ పరిచయం చేసుకున్నాడు.
కృష్ణపట్నం సందర్శించాలని మహిళను మభ్యపెట్టాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో విదేశీ మహిళతో కలిసి గూడూరుకు చేరుకున్నాడు సాయికుమార్. ఈ క్రమంలోనే మరో స్నేహితుడితో కలిసి సైదాపురం అడవిలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. భయంతో కేకలు వేస్తూ.. రోడ్డుపైకి పరుగులు తీసింది విదేశీ మహిళ. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. విదేశీ మహిళ దగ్గర సాయికుమార్ ఆధార్, పాన్ కార్డును గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరు గంటల్లోనే నిందితుల అరెస్ట్
విదేశీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం కేసును సైదాపురం పోలీసులు చేధించారు. ఆరు గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు మనుబోలు చెందిన సాయి, గూడూరు చెందిన అబీద్ గా పోలీసులు గుర్తించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకి వెళ్తున్న సమయంలో ఆమెను మభ్యపెట్టి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను నెల్లూరు జిల్లాకు రప్పించి సైదాపురం అటవీ ప్రాంతంలో అత్యాచారయత్నానికి ప్రణాళిక రూపొందించారని తెలిపారు.
Also Read: