Andhra News: భద్రం గురూ.. ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. అప్రమత్తం లేకుంటే అంతే ఇక..

గత వారం రోజులుగా జిల్లాలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పులిని పట్టుకునేందుకు అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. రెండు ప్రత్యేక వాహనాలలో ఐదుగురు నిపుణులు రాజమండ్రి చేరుకొని స్థానిక అటవీశాఖ అధికారులతో సమన్వయంగా రెస్క్యూ ప్రారంభించారు.

Andhra News: భద్రం గురూ.. ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. అప్రమత్తం లేకుంటే అంతే ఇక..
Rajahmundry Tiger Rescue

Edited By:

Updated on: Feb 06, 2026 | 11:38 AM

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గురువారం కూడా కొన్ని ప్రదేశాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో పులి సంచరిస్తున్న గ్రామాల్లో గస్తీని పెంచారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు బయటకురాకుండా సూచనలు చేస్తున్నారు. అలాగే పులి సంచారంపైన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. పులిని పట్టుకునేందుకు టెక్నాలజీని వినియోగించడమే కాకుండా పులిని సురక్షితంగా పట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

పులికి మత్తు ఇంజక్షన్ చేసే ప్రక్రియ నుంచి పునరావాసం వరకు అన్ని చర్యలు తీసుకునేకుందుకు నిపుణులు సిద్ధమయ్యారు. నిపుణుల బృందం 2007లో పుణె కేంద్రంగా రెస్క్యూ టీమ్ గా ఏర్పడి పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 230కి పైగా వన్యప్రాణులను సంరక్షించారు. 2024 వరకు ఈ రెస్క్యూ టీమ్ 7,293 వన్యప్రాణుల జాతులకు చికిత్స చేసి తిరిగి సహజవాసాలకు చేర్పించినట్టు లెక్కలు చెబుతున్నాయి.

మరో వైపు కట్టుదిట్టమైన నిఘా, డ్రోన్లు కెమెరాలు ఏర్పాటు చేశారు. పులినీ ఖచ్చితంగా గుర్తించేందుకు 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి జంతువుల కదలికలను చిప్‌లో నమోదు చేస్తాయి. మహారాష్ట్ర నుంచి తెప్పించిన 4G కెమెరాలు పులి కనిపించిన క్షణాల్లోనే లొకేషన్ , పోటోలు , పూర్తి వివరాలను నేరుగా అధికారుల ఫోన్లకు పంపేలా అమర్చారు.

అలాగే రాత్రి వేళల్లో పులి కదలికల కోసం ధర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వెలుగు లేకపోయినా పులి శరీర ఉష్ణోగ్రతను బట్టి దాని కదలికలను గుర్తించేలా డ్రోన్లు పనిచేస్తాయి. పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నా ప్రదేశాలలో మూడు చోట్ల పిటిజడ్ కెమెరాలు పెట్టారు. బోనులో పులి చిక్కుకున్న వెంటనే సంబంధిత శాఖ అధికారులకు అలర్ట్ వెళ్లే విధంగా వ్యవస్థను కూడా రూపొందించారు. రెస్క్యూ నిపుణులు, అటవీ శాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Follow Us