AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు..

|

Sep 17, 2022 | 3:39 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం..

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు..
Andhra Weather Report
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ కారణంగా 17, 18, 19 తేదీలలో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఇంకొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఉత్తర కోస్తా, యానాంలోని ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభించే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. కాగా, రాయలసీమ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.