AP Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

|

Jan 13, 2025 | 1:27 PM

సంక్రాంతి పండుగ వేళ ఏపీకి మరో షాక్ ఇచ్చాడు వరుణుడు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మరి ఏయే ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.?

AP Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Andhra Weather
Follow us on

పండుగ వేళ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు.. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. కాగా, అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..
—————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————-

ఈరోజు,రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-
————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది చదవండి: సంక్రాంతి జాతర.. ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి