AP Rain Alert: ఏపీకి రెయిన్ అలెర్ట్.. రాగల మూడు రోజుల్లో భారీ వర్ష సూచన..

|

Nov 03, 2021 | 2:23 PM

AP Weather Alert: అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం

AP Rain Alert: ఏపీకి రెయిన్ అలెర్ట్.. రాగల మూడు రోజుల్లో భారీ వర్ష సూచన..
Rain Alert
Follow us on

AP Weather Alert: అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరిన్ దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం లక్ష్యద్వీపం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీద ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కీమీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 3-4 రోజుల్లో మరింత బలపడు తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో ఉపరితల ద్రోణి కొమరిన్ ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుండి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్ తమిళనాడు తీర ప్రాంతం మీదుగా వ్యాపించి ఉంది. దీని కారణంగా ఈ రోజు నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం:
ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరుతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలోఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read:

Etela Rajendar: హుజూరాబాద్ ప్రజల బిక్ష నా పదవి.. ఈ విజయం వారికే అంకితంః ఈటల రాజేందర్

PM Modi: అజాగ్రత్త వద్దు.. మరో సంక్షోభం రావొచ్చు.. వ్యాక్సినేషన్​ స్పీడ్ పెంచండి..