Rain Alert for AP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాని సరిహద్దునున్న ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడననం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం లో కేంద్రీకృతమైంది. దీంతోపాటు దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5 .8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతం వద్దనున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ – ఉత్తర తమిళనాడు తీరానికి సుమారు నవంబర్ 18వ తేదీన చేరే అవకాశం ఉంది. వీటితోపాటు.. తూర్పు అరేబియా సముద్రం దాని పరిసర ప్రాంతమైన కర్ణాటక తీరానికి దగ్గరగా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 4 .5 కిలోమీటర్లు వరకు విస్తరించిఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది .రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది .
రాయలసీమ:
ఈరోజు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
Also Read: