Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

|

Mar 15, 2021 | 4:49 PM

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్ల రాకపోకల విషయంలో మార్పులు జరిగాయని....

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక...పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!
Follow us on

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్ల రాకపోకల విషయంలో మార్పులు జరిగాయని.. వాటిని ప్రయాణీకులు గమనించాలని అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి సికింద్రాబాద్-హౌరా-ఫలక్‌నామా, సికింద్రాబాద్-మన్మాడ్(అజంతా ఎక్స్‌ప్రెస్), సికింద్రాబాద్-ధనాపూర్ ట్రైన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాకుండా కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తాయని.. తిరుగు పయనంలోనూ ఈ మూడు రైళ్లు కాచిగూడ స్టేషన్‌కే చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు.

అటు విశాఖ,రాయలసీమ వాసులను కూడా రైల్వే శాఖ అలర్ట్ చేసింది. ఆయా డివిజన్‌ పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్‌-గుంటూరు రైల్వే సెక్షన్‌లో ఆధునికీకరణ పనులతో భువనేశ్వర్‌-కెఎస్‌ఆర్‌ బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రత్యేక రైళ్లు వయా కృష్ణాకెనాల్‌, గూడూరు, రేణిగుంట, మెల్పాక్కం, కాట్పడి, జోలార్‌పెట్టై మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ మార్పులు కొనసాగుతాయని చెప్పారు.

రైళ్ల రాకపోకలు మార్పులు..

సికింద్రాబాద్-హౌరా-ఫలక్‌నామా(ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్)

సికింద్రాబాద్-మన్మాడ్(అజంతా ఎక్స్‌ప్రెస్)

సికింద్రాబాద్-ధనాపూర్

ఈ మూడు రైళ్లు మార్చి 16 నుంచి కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.

పలు రైళ్లు దారి మళ్లింపు….

భువనేశ్వర్‌-కెఎస్‌ఆర్‌ బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రత్యేక రైళ్లను వయా కృష్ణాకెనాల్‌, గూడూరు, రేణిగుంట, మెల్పాక్కం, కాట్పడి, జోలార్‌పెట్టై మీదుగా దారి మళ్ళించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ మార్పులు కొనసాగుతాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!