AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉన్నది ఒక బల్బ్, ఒక ఫ్యాన్.. వచ్చిన కరెంట్ బిల్లు మాత్రం అరలక్ష.. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Andhra Pradesh: సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే... కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది.

Andhra Pradesh: ఉన్నది ఒక బల్బ్, ఒక ఫ్యాన్.. వచ్చిన కరెంట్ బిల్లు మాత్రం అరలక్ష.. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..
Current Bill
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 14, 2021 | 3:59 PM

Share

Andhra Pradesh: సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే… కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది. అదే, చిన్నపాటి దుకాణాలు, మెకానిక్‌ షెడ్లకు కమర్షియల్‌ బిల్లు పేరిట కాస్త సాధారణం కంటే ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, ఓ చిన్నపాటి పంక్చర్‌ షాప్‌ కు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ బిల్లును చూసిన యజమానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్‌ షాప్‌ ఉంది. దానికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే.. ఎవరికైనా షాక్‌ కొట్టినంత పనవుతుంది. చిన్నపాటి దుకాణానికి ఏకంగా 57 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. బిల్ కొట్టే వారు ఆ మేరకు బిల్లును షాపు యజమానికి ఇవ్వగా అది చూసి షాక్ అవడం అతని వంతు అయ్యింది. ఇంత భారీ మొత్తంలో కరెంట్ బిల్లు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదోనిలోని బావి వీధిలో బసవ అనే వ్యక్తి పంక్చర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. కాగా, తనకు ఉన్న చిన్న పంక్చర్ దుకాణానికి 57వేల 965 రూపాయల కరెంట్‌ బిల్లు రావడంపై అతని షాక్‌కు గురయ్యాడు. ఒక బల్బు.. ఒక్క ఫ్యాను మాత్రమే ఉన్న షాప్‌ కు ఇంత పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. మరి అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Also read:

President Phone Call: తెలంగాణ జడ్చర్ల వాసికి రాష్ట్రపతి ఫోన్‌..!(Video)

Ganesh Navaratri 2021: ఇంటికో ఉద్యోగి.. 58 ఏళ్లుగా ఊరంతా ఓకే గణపతి.. పూర్తి మ్యాటర్ తెలిస్తే వావ్ అంటారు..

Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ