Booster Dose: దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచంటే.?

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి వీరికి కోవిడ్ వ్యాక్సిన్ 3వ డోస్(బూస్టర్ డోస్) వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.

Booster Dose: దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచంటే.?
Covid Vaccination
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 08, 2022 | 4:18 PM

కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారు ఈ బూస్టర్ డోస్‌కు అర్హులని కేంద్రం ప్రకటించింది. అన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలోనూ ఆదివారం అనగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండు డోసులతో పాటు 60 ఏళ్ల పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు ఇస్తోన్న ప్రికాషనరీ డోస్(బూస్టర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. దేశంలో 15 ఏళ్లు పైబడినవారిలో 96 శాతం మంది కనీసం ఒక కోవిడ్ వ్యాక్సిన్ డోస్ తీసుకోగా.. 83 శాతం మంది రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 60 ఏళ్ల పైబడిన వారిలో 2.4 కోట్ల మందికి బూస్టర్ డోస్.. 12 నుంచి 14 ఏళ్లలోపు వారిలో 45 శాతం మందికి తొలి డోస్ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.