SP Malika Garg: ‘బాగుంటే ఓకే, లేదంటే బెండు తీయడమే’.. రౌడీషీటర్లకు ఎస్‌పీ మలిక గార్గ్‌ స్ట్రైయిట్ వార్నింగ్..

|

Jul 31, 2021 | 1:28 PM

ఒంగోలులో రౌడీషీటర్లకు ప్రకాశం జిల్లా ఎస్‌పీ మలిక గార్గ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా నమోదైన వారిని

SP  Malika Garg: బాగుంటే ఓకే, లేదంటే బెండు తీయడమే.. రౌడీషీటర్లకు ఎస్‌పీ మలిక గార్గ్‌ స్ట్రైయిట్ వార్నింగ్..
Sp Mallika Garg
Follow us on

ఒంగోలులో రౌడీషీటర్లకు ప్రకాశం జిల్లా ఎస్‌పీ మలిక గార్గ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా నమోదైన వారిని పోలీస్టేషన్లకు పిలిపించి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో చేసిన అసాంఘిక కార్యక్రమాలు, హత్యలు, దోపిడీలు తరహా నేరాలు తిరిగి చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రతివారం రౌడీషీటర్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని, అలాగే ఆ వారం రోజులు తాము ఎక్కెడెక్కడికి వెళ్ళింది అనే విషయాలను పోలీసులు తెలపాలని ఆమె సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై ఇక నుంచి గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ఎవరు.. ఎక్కడ ఎలాంటి నేరాలు చేసేందుకు ప్రయత్నించినా తమకు తెలిసి పోతుందని  హెచ్చరించారు.

జీవించడానికి ఏ వృత్తుల్లో ఉన్నారు అనే విషయాలను పోలీసులకు ఎప్పటికప్పుడు తెలపాలన్నారు.చ రౌడీ షీటర్లు ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించినా తీసుకునే చర్యలు ఊహాతీతంగా ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు బానిసలై కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని,  వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లతో ముఖాముఖి మాట్లాడుతూ, గతంలో వారు చేసిన నేరాలు, ప్రస్తుతం జీవిస్తున్న విధానాన్ని ఎస్‌పీ  అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే వారిపై ఉన్న షీట్లను ఎత్తివేసేందుకు సహకరిస్తామని,  లేకుంటే జీవితాంతం రౌడీషీటర్లుగా మిగిలిపోవాల్సి వస్తుందని ఎస్‌పీ మలిక గార్గ్‌ రౌడీషటర్లకు వార్నింగ్ ఇచ్చారు.

Prakasam Sp

 

Also Read:  నడుస్తూ ఉండగా వృద్దుడి కాళ్లను చుట్టేసిన విష సర్పం.. విడిపించుకున్నాక అతడు ఏం చేశాడో చూడండి

Viral Video: ఇంత క్రూరత్వమా..! అడవి రాజైన నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా..!