అసలే వేట పాలెం. ఆపై అటవీ భూముల వ్యవహారం. దానికి తోడు సాగు విషయంలో వివాదం. దీంతో చెప్పేదేముందీ.. ఆ రగడే వేరుగా ఉంటుంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం, కటారివారిపాలెం గ్రామాల మధ్య అటవీ భూముల విషయంలో ఓ వివాదం చెలరేగింది. రామాపురం పంచాయితీ పరిధిలోని భూముల్లో సరుగుడు మొక్కలను నాటేందుకు కటారివారి పాలెం గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. ఇదే రామాపురం గ్రామస్థుల కంప్లయింట్.
వ్యవహారం స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో కటారివారిపాలెం వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఇక్కడ ఎలాంటి చెట్లు నాటుడు కార్యక్రమాలు ఉండరాదని.. తేల్చి చెప్పారు. దీంతో గ్రామస్తులు వర్సెస్ పోలీసులు విలేజ్ వార్ చెలరేగింది.
ఇరు వర్గాల వారి వాదనలు విన్న పోలీసులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. కానీ కటారివారిపాలెం గ్రామస్తులు మాత్రం ఈ భూమిపై హక్కులన్నీ మావేనంటున్నారు. దీంతో తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరెలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..
Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..