Visakhapatnam: ఆ ఇల్లు చూస్తే అలా ఉంది.. కరెంట్ బిల్లేమో ఇలా వచ్చింది.. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన..

|

Sep 18, 2021 | 9:41 AM

Visakhapatnam: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో.. విద్యుత్ మీటర్ల పనితీరు లోపమో తెలియదు కానీ.. పేద ప్రజల పాలిట గుదిబండగా

Visakhapatnam: ఆ ఇల్లు చూస్తే అలా ఉంది.. కరెంట్ బిల్లేమో ఇలా వచ్చింది.. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన..
Current Bill
Follow us on

Visakhapatnam: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో.. విద్యుత్ మీటర్ల పనితీరు లోపమో తెలియదు కానీ.. పేద ప్రజల పాలిట గుదిబండగా మారుతున్నాయి వారు వేసే కరెంట్ బిల్లులు. సాధారణంగా కరెంట్‌ ముట్టుకుంటే షాక్‌ కొడుతుందని తెలుసు.. కానీ, ప్రస్తుతం చాలా చోట్ల విద్యుత్‌ అధికారులు వేసే బిల్లు చూస్తేనే షాక్‌ కొడుతుంది. ఇల్లు చూస్తే.. పెచ్చులూడి పోయిన పాత గోడలు.. గట్టిగా గాలివాన వచ్చిందంటే కూలిపోయేట్టున్న పై కప్పు. మరి అలాంటి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు అక్షరాల తొంభైవేల రూపాయలు.

వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీ సీలేరు శివాలయం వీధిలో కిమ్ముడు స్వామినాథన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటికి సెప్టెంబర్ నెలకు గాను కరెంట్ బిల్లు 90,404 రూపాయలు వచ్చింది. ఆ బిల్లు చూసి ఆయన అవాక్కయ్యారు. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇతని ఇంట్లో ఉన్నవి రెండు ఫ్యాన్లు, మూడు బల్బులు, ఒక టీవీ. వీటికే ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ రెండు మూడు వందల కరెంట్ బిల్లు దాటలేదన్నారు. అలాంటిది ఏకంగా 94 వేల రూపాయల బిల్లు రావడంతో ఖంగుతిన్నాడు.

అద్దె ఇంట్లో ఉంటూ, రెక్కల కష్టంమీద ఆధారపడి బతుకుతున్న పేద గిరిజనుడికి 90 వేలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అధికారులను అడిగినా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో వాపోయాడు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో మీడియాను ఆశ్రయించాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది విద్యుత్ అధికారుల తప్పిదమో.. లేక రీడింగ్ తీసే పరికరంలో సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందో ఆరా తీయాలని విన్నవించారు.

Also read:

Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..

F3 Movie: మరింత జోష్‌తో రానున్న వెంకీ- వరుణ్ ‘ఎఫ్3’.. సందడిగా మొదలైన షూటింగ్..

chinna jeeyar swamy: శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు అందిన ఆహ్వానం(వీడియో)