Andhra pradesh: ఏపీలో విద్యుత్‌ కోతలు నిజమేనా.? విద్యుత్ సంస్థలు చెబుతోన్న వివరణ ఇదే..

|

May 30, 2023 | 6:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ విద్యుత్‌ సంస్థలు స్పందించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ అమల్లో లేవని తేల్చి చెప్పాయి. గత కొన్ని రోజులుగా కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్నట్లు ఏపీలో విద్యుత్‌ కోతలు లేనే లేవని క్లారిటీ ఇచ్చాయి...

Andhra pradesh: ఏపీలో విద్యుత్‌ కోతలు నిజమేనా.? విద్యుత్ సంస్థలు చెబుతోన్న వివరణ ఇదే..
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ విద్యుత్‌ సంస్థలు స్పందించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ అమల్లో లేవని తేల్చి చెప్పాయి. గత కొన్ని రోజులుగా కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్నట్లు ఏపీలో విద్యుత్‌ కోతలు లేనే లేవని క్లారిటీ ఇచ్చాయి. ప్రతీ రోజు 2 నుంచి 3 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారనడం పూర్తిగా అబద్ధమని, వాస్తవాలను వక్రీకరించడమేనని చెప్పుకొచ్చాయి.

గతేడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ రేట్లు పెరిగినప్పటికీ ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఏకైక ఉద్దేశంతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. రోజు వారీగా డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, గాలి దుమారాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కలిగే విద్యుత్ అంతరాయాన్ని చూపిస్తూ రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని కథనాలు ప్రచురించడం పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేయడమే అవుతుందన్నారు.

ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని విద్యుత్ సంస్థలు మనవి చేశాయి. వార్తా కథనాల్లో పేర్కొన్నట్లు రాత్రి వేళ్లలో కూడా అనూహ్యంగా విద్యుత్ పెరగడం నిజమేనన్న విద్యుత్ సంస్థలు.. దానివల్ల 11కేవీ పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోందని. అలాగే 33 కేవీ లైన్లు, సబ్‌స్టేషన్స్‌పై లోడు ప్రభావం పెరుగుతుందని తెలిపారు. దీనిని అదిగమించేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అదనపు ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ సంస్థలు తెలిపాయి.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..