Weather Alert: ఏపీలో రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

Weather Alert: ఏపీలో రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Heat

Updated on: Jun 02, 2023 | 6:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు,కూనవరం, వైయస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్లు, ఏలూరు జిల్లా కుకునూర్, మన్యంజిల్లాలోని కొమరాడ సహా 256 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 127 మండలాల్లో కూడా ఈ వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం పల్నాడు జిల్లా ఈపూర్, విజయనగరం జిల్లా కనిమెరక లో 44.9°C, ఏలూరు జిల్లా శ్రీరామవరం,ఏదులగూడెంలో 44.8°C, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 44.8°C , బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 10 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.

శనివారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆదివారం రోజున విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C – 45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు వంటివి తాగాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం