Govt of India: కేంద్ర హోంశాఖ లేఖతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చు.. ఆ లేఖలో సవరణలే కారణం..!

|

Feb 13, 2022 | 6:19 AM

Andhra Pradesh vs Telangana: కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఫస్ట్‌ విడుదల చేసిన లేఖను ఎందుకు సవరించారని..

Govt of India: కేంద్ర హోంశాఖ లేఖతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చు.. ఆ లేఖలో సవరణలే కారణం..!
Follow us on

Andhra Pradesh vs Telangana: కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఫస్ట్‌ విడుదల చేసిన లేఖను ఎందుకు సవరించారని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నేతలు. వివరాల్లోకెళితే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై ఈనెల 17న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అజెండాను నిన్న ఉదయం ప్రకటించారు అధికారులు. అయితే, అజెండాలో కొన్ని మార్పులు చేస్తూ సాయంత్రం మరోసారి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను చేర్చిన కేంద్రం, దాన్ని మార్చి కేవలం 5 అంశాలకు పరిమితం చేసింది.

అయితే, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడిన అనంతరం, పొరపాటును గ్రహించిన కేంద్ర హోంశాఖ తాజాగా రాష్ట్రాలకు లేఖ పంపింది. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు జీవీఎల్. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిధిలోకి రాని ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు సహా మరికొన్ని అంశాలను ఎజెండా నుంచి తొలగించినట్టు చెప్పింది కేంద్రం. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కమ్‌ మధ్య విద్యుత్‌ బకాయిల వివాదం, పన్ను విధానంలో ఉన్న వ్యత్యాసం తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, APSCSCL, TSCSCL నగదు నిల్వల అంశంపై చర్చించనున్నట్టు కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్ ‌కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇదిలాఉంటే.. లేఖలో సవరణలపై ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ అధికార వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా పెట్టి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. వెంటనే కేంద్ర హోమ్ శాఖ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన స్వార్ధంగా జరిగింది అని ప్రధాని మోదీనే స్వయంగా చెప్పారని, ఇలాంటి సున్నిత అంశంలో కేంద్ర హోమ్ శాఖ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు అధికార వైసీపీ నేతలు. ముందే ఆ అంశాన్ని తీసుకురాకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, ఇలా అవమానించడం మంచి పద్ధతి కాదని నేతలు అంటున్నారు.

Also read:

GHMC: ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డికి జీహెచ్‌ఎంసీ షాక్‌.. ఫ్లెక్సీలను తొలగించనందుకు భారీగా జరిమానా..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Gujarat Bank Fraud: దేశంలో వెలుగులోకి భారీ కుంభకోణం.. వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన గుజరాత్ వ్యాపారి..