Andhra Pradesh: హీటెక్కిన ఒంగోలు రాజకీయం.. బాలినేని, దామచర్ల మధ్య పీక్స్‌కు చేరిన డైలాగ్ వార్..

ఒంగోలు రాజకీయ హీటెక్కింది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, దామచర్ల జనార్థన్‌ మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఒంగోలులో ఎవరి దమ్మెంతో చూసుకుందాం..ఇక్కడెవరూ భయపడి ఒణికిపోవడం లేదు..

Andhra Pradesh: హీటెక్కిన ఒంగోలు రాజకీయం.. బాలినేని, దామచర్ల మధ్య పీక్స్‌కు చేరిన డైలాగ్ వార్..
Balineni Srinivas Vs Damacharla Janardhana

Updated on: Jan 22, 2023 | 11:23 AM

ఒంగోలు రాజకీయ హీటెక్కింది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, దామచర్ల జనార్థన్‌ మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఒంగోలులో ఎవరి దమ్మెంతో చూసుకుందాం..ఇక్కడెవరూ భయపడి ఒణికిపోవడం లేదు.. ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాను చంద్రబాబుతో టచ్‌లో ఉన్నానంటూ దామచర్ల జనార్థన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరవుతున్నారు బాలినేని శ్రీనివాస్‌. ఒంగోలు నుంచి తాను వైసీపీ టికెట్‌పైనే మళ్లీ పోటీ చేస్తానంటున్నారు.

అయితే బాలినేని వ్యాఖ్యలను ఖండించారు దామచర్ల. ఆయన చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని, ఒంగోలు నుంచి టిడిపి టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందని..తాను ప్రచారం చేస్తున్నట్టు బాలినేని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు. తాను టిడిపి టికెట్‌పైనే ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నానని.. దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందామని బాలినేనికి సవాల్‌ విసిరారు.

ఇక టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నామన్న ఆరోపణలపైనా స్పందించారు దామచర్ల జనార్థన్‌. బాలినేని అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. ఆయన చంద్రబాబును కలుస్తున్నారా, పవన్‌ కళ్యాణ్‌ను కలుస్తున్నారా అన్నది తనకు అవసరం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..