AP News: నెల్లూరు జిల్లాలో మైనింగ్‌పై హీటెక్కిస్తున్న నేతల మాటలు

|

Oct 24, 2023 | 8:59 AM

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతుంది. మైనింగ్‌పై వైసీపీ, టీడీపీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. 80శాతం మంది టీడీపీ నేతలే మైనింగ్‌లో భాగస్వాములంటూ అనిల్‌ కుమార్‌ యాదవ్ ఆరోపిస్తే.. దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ చేశారు సోమిరెడ్డి.

AP News: నెల్లూరు జిల్లాలో మైనింగ్‌పై హీటెక్కిస్తున్న నేతల మాటలు
Somireddy Vs Anil
Follow us on

మైనింగ్ చుట్టూ నెల్లూరు జిల్లా రాజకీయం తిరుగుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో అక్రమ మైనింగ్ రాజ్యమేలుతుంది. ఇప్పుడు ఇదే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్యమాటల యుద్దానికి దారితీసింది. అధికారుల అండదండలతో సైదాపురంలో టీడీపీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేదు లేదు.. వైసీపీ నేతలే మైనింగ్ మాఫియా చేస్తున్నారని.. రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది.

సైదాపురంలో అక్రమ మైనింగ్ విషయంపై స్పందించారు మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. మైనింగ్ మాఫియాకు రాపూరు సీఐ, సైదాపురం ఎమ్మార్వో ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం కాదా… వైసీపీ నాయకులు అడ్డుకుంటే వాహనాలను సీజ్‌ చేయకుండా సాగనంపింది సీఐ కాదా అని ప్రశ్నించారు. వెంకటగిరి ఇంచార్జీకి అవగాహన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్‌ వెనుక టీడీపీదే పెద్ద చేయి అని విమర్శించారు అనిల్‌ కుమార్‌ యాదవ్.

అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి సోమిరెడ్డి. వైసీపీ కనుసన్నల్లోనే మాఫియా పెట్రేగిపోతుందని చెప్పారు. మాజీ మంత్రి, ప్రజెంట్ జిల్లా మంత్రి బృందమే మైనింగ్ వ్యాపారం చేస్తుందని తెలిపారు సోమిరెడ్డి. ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిరూపించాలంటూ సవాల్ చేశాడు సోమిరెడ్డి.

ఇప్పటికీ.. సైదాపురంలో 150 హిటాచ్‌లు, వందల కొద్ది లారీలు మైనింగ్ తరలించేందుకు పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు సోమిరెడ్డి. అయితే టీడీపీ సవాల్‌ను వైసీపీ స్వీకరిస్తుందా? లేదా అని చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి