
ఓ కానిస్టేబుల్‌కి దట్టమైన అడవిలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. ఆ మార్గంలో వాహనం వెళ్లేందుకు వీలు లేకపోవటంతో మరో వ్యక్తి సహాయంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం భుజంపై మోసుకొచ్చాడు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఓ హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. అనాధ శవాన్ని తన భుజాలపై మోసి తాను అసలైన సమాజ సేవకుడినని నిరూపించాడు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్… పెద్దదోర్నాల మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతం గుండా వెళ్లే సమయంలో ఆయనకు ఒక అనాధ శవం కనిపించింది. అటువైపు ఎంతోమంది వెళ్తూ వస్తుంటారు. నిత్యం వందల మంది తిరుగుతుంటారు. కాని ఎవరూ ఆ శవం వైపు కూడా చూడలేదు.
అసలే కరోనా.. ఒకవేళ ఆ అనాధ శవం వల్ల తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయంతో దరిదాపుల నుంచి కూడా ఎవరూ వెళ్లలేదు. కాని హెడ్‌కానిస్టేబుల్ సురేష్ మాత్రం అలా అనుకోలేదు. మానవతా విలువలు తెలిసిన తనకు… అక్కడ పడిఉన్న శవాన్ని చూస్తూ వదిలేయలేకపోయాడు. ఎలాగైనా.. పోస్టుమార్టమ్ కోసం తీసుకెళ్లాలనుకున్నాడు. అసలే రోడ్డు మార్గం సరిగాలేదు. అంబులెన్సులు వచ్చే పరిస్థితి కూడా లేదు. సాయం ఎవరిని అడిగినా.. తిరస్కరించేవారే ఎదురయ్యారు. చివరికి ఓ వ్యక్తిని పిలిచి… కర్రకు శవాన్ని కట్టి.. భుజంపైకి ఎత్తుకున్నాడు. దాదాపు కిలోమీటరు వరకు శవాన్ని మోస్తూ వెళ్లాడు.
రాళ్లు రప్పలూ దాటుకుంటూ.. కొండలు ఎక్కి దిగుతూపోయాడు. కిలోమీటరు నడిచిన అనంతరం వాహనం ఎక్కించి పోస్టుమార్టం నిమిత్తం దోర్నాలకు తీసుకొచ్చాడు… కరోనా కష్టకాలంలో అనాధ మృతదేహాన్ని మానవతా దృక్పదంతో మోసుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ సురేష్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు ఫిక్స్..