Andhra Pradesh: విలాసాలకు ఈజీ మనికి అలవాటు పడిన ఓ యువకుడు చోరీల బాట పట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా దొంగతనం చేస్తూ.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. వరస దొంగ తనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఆరితేరిన ఈ దొంగను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, వీరవాసరం, అకివీడీ , పాలకొడేరు, ఉండి ల్లో చోరీలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. చోరీ చేసిన తీరును బట్టి పాతనేరస్తుడని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. చోరీల్లో ఆరితేరిన కాకినాడకు చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
రవిశంకర్ తూర్పుగోదావరికి చెందిన పాతనేరస్తుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పొన్నాడ రవిశంకర్ ఫోటోను పోలీసులు విడుదల చేశారు. రవిశంకర్ ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామంటూ ప్రచారం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..