Police Checkings: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టల కలకలం.. జగ్గయ్యపేటలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Police Checkings: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టల కలకలం రేగింది. ఆర్టీసీ తరలిస్తున్న కోటి రూపాయలను..

Police Checkings: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టల కలకలం.. జగ్గయ్యపేటలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Updated on: Jan 31, 2021 | 9:57 PM

Police Checkings: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టల కలకలం రేగింది. ఆర్టీసీ తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు జగ్గయ్యపేట పరిధిలోని గిరకాపడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా పోలీసులకు భారీ స్థాయిలో నగదు పట్టుబడింది.

ఆర్టీసీ బస్సులో సత్యనారాయణ, అతని కొడుకు శ్రావణ్ వద్ద కోటి రూపాయల నగదును గుర్తించారు. ఈ నగదును ఒంగోరు నుంచి నూజివీడుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదుతో సహా, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించారు. ఒంగోరులో పొలం అమ్మిన డబ్బులు తీసుకుని స్వగ్రామం అయిన నూజివీడు మండలం ఎనమలకుదరు వెళ్తున్నట్లు వ్యక్తులిద్దరూ వివరణ ఇచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం, ఇతర పేపర్లను చూపించారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు బదిలీ చేశారు.

Also read:

Kerala Man : సెంటర్ పాయింట్‌గా మారిన కేరళ దివ్యాంగుడు.. ‘మన్‌ కి బాత్‌’లో ప్రధాని మోదీ ప్రశంసలు

AIADMK Party: అన్నాడీఎంకేలో శశికళను చేర్చుకునే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన తమిళనాడు మంత్రి