Andhra Pradesh: ఆటోలో లక్షల విలువజేసే నగలతో బ్యాగ్ మరచిపోయిన వృద్ధురాలు.. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసులు

| Edited By: Surya Kala

Nov 21, 2023 | 7:57 PM

వృద్ధాప్యం, అల్జీమర్స్ కారణంగా ఆటోలో బంగారునగల బ్యాగ్ మరచిపోయింది ఓ వృద్దారాలు. ఆటోలో బంగారు నగలు ఉన్న విషయం తెలుసుకొని అదృష్టం కలిసి వచ్చింది అనుకొన్నాడు ఆటో డ్రైవర్. అయితే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో మరచిపోయిన బ్యాగ్ విషయం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో  వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh: ఆటోలో లక్షల విలువజేసే నగలతో బ్యాగ్ మరచిపోయిన వృద్ధురాలు.. 24 గంటల్లో కేసు చేధించిన పోలీసులు
Nandyal Police
Follow us on

సాధారణంగా ఎక్కడ చూసినా పోలీసులపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తమను అనవసరంగా  కొట్టారని, తిట్టారని, లంచం అడిగారని, బాధితులకు కాకుండా నిందితులకు కొమ్ముకాస్తున్నారని.. ఇలాంటి విమర్శలను తరచుగా వింటూనే ఉన్నాం.. అనేకం చూస్తున్నాం. అయితే నంద్యాలలోని పోలీసులు ఈ కామెంట్స్ కు భిన్నంగా వ్యవహరించారు. వృద్ధురాలికి అండగా నిలిచి 24 గంటల్లో న్యాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వృద్ధాప్యం, అల్జీమర్స్ కారణంగా ఆటోలో బంగారునగల బ్యాగ్ మరచిపోయింది ఓ వృద్దారాలు. ఆటోలో బంగారు నగలు ఉన్న విషయం తెలుసుకొని అదృష్టం కలిసి వచ్చింది అనుకొన్నాడు ఆటో డ్రైవర్. అయితే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో మరచిపోయిన బ్యాగ్ విషయం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో  వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మిస్ అయిన నగలు కొన్ని గంటల్లోనే పోలీసులు బాదితులకు ఇవ్వడంతో పుల్ ఖుషి అయ్యారు బాధితులు.

 

ఇవి కూడా చదవండి

నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ వృద్దురాలు ఆటో ఎక్కి దిగే క్రమంలో ఆటోలో విలువైన బంగారు నగలు,నగదు ఉన్న బ్యాగ్ మరచి పోయింది. వృద్దరాలు మరచి పోయింది అనుకున్న బ్యాగ్ తో అదృష్టం కలిసి వచ్చింది అనుకున్నాడు ఆటో డ్రైవర్. ఆటోలో తాను బ్యాగ్ మరచిపోయిన విషయం గుర్తు తెచ్చుకున్న వృద్దురాలు సుబ్బరత్నమ్మ బంధువులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది

ఫిర్యాదు తీసుకున్న ఒన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల  సహాయంతో ఆటో నెంబర్ తో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాగ్ ను  పోలీసులకు ఇచ్చేశాడు. ఆ బ్యాగ్ లో సుమారు రూ. 9 లక్షలు విలువ జేసే బంగారు నగలు,  8 వేల రూపాయల నగదుని పోలీసులు బంధువులకు అందజేశారు. పొగొట్టుకున్న బంగారం, నగదును కొన్ని గంటల్లో తిరిగి ఇవ్వడంతో అనందంతో తబ్బిఉబ్బిపోయారు బాధితులు. కొన్ని గంటల్లోనే బాదితులకు న్యాయం చేసిన ఒన్ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..