Puttaparthi: నీచాతి నీచం.. లేగదూడలపై లైంగిక దాడి.. పోలీసులకు రైతుల ఫిర్యాదు

కామాంధులు పశువులను సైతం వదలడం లేదు. ఓ కామపిశాచి లేగదూడలపై పైశాచికానికి పాల్పడ్డాడు. ఇదేంటని మందలించిన రైతులను అటాక్ చేశాడు. దీంతో గ్రామస్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Puttaparthi: నీచాతి నీచం.. లేగదూడలపై లైంగిక దాడి.. పోలీసులకు రైతుల ఫిర్యాదు
Puttaparthi Police
Follow us
Ram Naramaneni

|

Updated on: May 24, 2023 | 3:17 PM

ఎవడైనా ఒళ్లు తెలియనంత కామంతో ఉంటే వాడు మనిషా పశువా అంటాం. కానీ వీడు అంతకుమించి. ఈ వార్త చెప్పడానికి కూడా కష్టమే.. కానీ ఇలాంటి మనుషులూ ఉంటారని జనానికి తెలియాలి. సొసైటీలో ఎలాంటి నీచులు ఉంటారో అవగాహన రావాలి. శ్రీసత్యసాయి జిల్లాలో  భక్తవత్సలం అనే ఓ ఉన్మాది ఉన్నాడు. వాడు నిచాతి నీచంగా పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పుట్టపర్తి మండల పరిధి రాచువారిపల్లిలో  రాత్రి వేళల్లో మద్యం మత్తులో లేగదూడలపై లైంగిక దాడి వ్యక్తిని స్థానికులు గుర్తించారు. ఇదేం గలీజు పని అని మందలించడంతో తిరిగి రైతులపై దాడికి పాల్పడ్డాడు.

దీంతో పుట్టపర్తి రూరల్ పోలీసులకు రైతుల ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన రామయ్య, కుమార్‌సాబ్‌, నరసింహులు, సుజాత, పోతన్న తదితరులు ఫిర్యాదు పత్రంలో సంతకాలు చేసి పోలీసులకు అందజేశారు. మూగప్రాణాలను కూడా హింసిస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న కామాందుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పశువులపై లైంగిక దాడిని బీస్టియాలిటీ అంటారు. తెలుగులో పశుప్రాయతగా చెబుతారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..