Drug injection: యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా.. విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన మత్తు ఇంజక్షన్లు..

Drug injection: విశాఖపట్నరంలో యువతే టార్గెట్‌గా చేసుకుని మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి గుట్టును టాస్క్ ఫోర్స్..

Drug injection: యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా.. విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన మత్తు ఇంజక్షన్లు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 12, 2021 | 12:09 PM

Drug injection: విశాఖపట్నరంలో యువతే టార్గెట్‌గా చేసుకుని మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అంతేకాదు.. దాదాపు 1500 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్న పాత నేరస్థుడైన నక్కా మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్లపూడి గాంధీబొమ్మ సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నక్కా మహేష్‌ వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు.. అతన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు బయటపడ్డాయి. అతన్ని అదుపులోకి విచారించగా.. పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్డర్ చేసినట్లు వెల్లడించాడు. కాగా, ఫేక్ అడ్రస్‌లతో ఇంజక్షన్లు ఆడ్డర్ చేసి ఎవరికంటా పడుకుండా వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నక్కా మహేష్ గతంలోనూ ఇదే మాదిరిగా మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తూ అనేకసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. డబ్బు సంపాదనకు సులువైన మార్గమని భావించి మహేష్ ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also read:

Breaking: మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్ నోటిసులు.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..

‘మహా సముద్రం’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊర మాస్ లుక్‏లో జగ్గుభాయ్ అదుర్స్..