Tiger Skin Smugglers : నల్లమల అడవి ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లింగ్.. పోలీసుల అదుపులో ముగ్గురు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత చర్మం స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా పట్టుబడింది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత చర్మం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు

Tiger Skin Smugglers : నల్లమల అడవి ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లింగ్..  పోలీసుల అదుపులో ముగ్గురు

Updated on: Jan 26, 2021 | 1:29 PM

Tiger Skin Smugglers : కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత చర్మం స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా పట్టుబడింది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత చర్మం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లింగ్ వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే .. శ్రీశైలం సమీపంలోని హఠకేశ్వరం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులకు దిగారు. టూవీలర్ మీద చిరుత పులి చర్మాన్నితరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సున్నిపెంట, దోర్నాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పులి చర్మాన్ని ల్యాబ్‌కు తరలించారు. త్వరలోనే పులి వయసు, దానిని ఎలా చంపేశారనే విషయాలపై విచారణ జరుగుతుందని డీఎఫ్‌ఓ అప్పావు వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

అమీన్‌పూర్ తీవ్ర విషాదం.. మేకపిల్లను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయిన యువకుడు