వరదలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై, ఆయన కులంపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు, పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలు చేసిన వారిని తాజాగా అరెస్ట్ చేసి.. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటన్నీటికి లీడ్‌గా వ్యవహరించిన శేఖర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ వీడియోలు ఎవరు చేయమన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, సదరు వీడియోలకు స్క్రిప్ట్ రాసింది ఎవరు, ఫండింగ్ ఎవరు చేశారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ వీడియోలో మంత్రిపై దూషణలు చేసిన శేఖర్ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పలు యాడ్స్‌లో నటించినట్లు సమాచారం. కాగా జగన్ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు టీడీపీ చేస్తున్న పెయిడ్ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా ఉన్నాడని వైసీపీ ఆరోపించింది.