Haryana Gang: హర్యానా గ్యాంగ్‌ ఘరానా చోరీలు.. కస్టమర్లకు మస్కాకొట్టి మాయచేస్తారు..

సాగర నగరంలో హర్యానా గ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. సిటీలో వేరువేరు ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన సందీప్ తో సహా

Haryana Gang: హర్యానా గ్యాంగ్‌ ఘరానా చోరీలు.. కస్టమర్లకు మస్కాకొట్టి మాయచేస్తారు..
Haryana Robbers

Updated on: Jun 07, 2022 | 9:18 PM

సాగర నగరంలో హర్యానా గ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. సిటీలో వేరువేరు ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన సందీప్ తో సహా నలుగురు వ్యక్తుల ముఠా విశాఖలో గత కొంత కాలంగా విచ్చలవిడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సందీప్ తో పాటు సచిన్, సత్విందర్ సింగ్, అఫ్రైల్ ఖాన్ అనే నలుగురిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసేందుకు ఒంటరిగా వెళ్లే కస్టమర్లకు మస్కా కొడుతుంది ఈ గ్యాంగ్. వారి వద్ద అసలును పోలిన నకిలీ కార్డులతో తారుమారు చేసి నగదు లాగేస్తోంది ఈ ముఠా. ఈ గ్యాంగ్ పై.. విశాఖలో 10 నేరాలతో పాటు నెల్లూరు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ కేసులున్నాయి. వివిధ ప్రాంతాల్లో నేరాలు చేసి 4.72 లక్షలు లాగేసింది ఈ ముఠా. విశాఖలో ఏటీఎం ల వద్ద కస్టమర్లను మస్కా కొట్టిన నేరాలతో.. ఓ దారి దోపిడీ కేసులో నిందితులుగా ఉన్నారు. కూపీ లాగిన పోలీసులు.. పక్కా ఆధారాలతో నిందితులను ట్రాక్ చేశారు. 125 ఏటిఎం కార్డులు, 29వేల నగదు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. స్వైపింగ్ మెషిన్, కారు సీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో ఇటువంటి నేరాలతోనే నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలోనూ అరెస్టయ్యారు. అయినా బుద్ధి మార్చుకోకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఒంటరి కస్టమర్లు… అపరిచితుల మాటలు నమ్మొద్దు అని సూచిస్తున్నారు పోలీసులు.

Loading...
Unable to load recommendations.
Follow Us