AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clashes in Tadipatri: తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు.. మొదలైన అరెస్టుల పర్వం.. తొలి అరెస్ట్ వారి నుంచే..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నేతల మధ్య ఘర్షణను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ వివాదంలో అరెస్టుల పర్వం మొదలు పెట్టింది.

Clashes in Tadipatri: తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు.. మొదలైన అరెస్టుల పర్వం.. తొలి అరెస్ట్ వారి నుంచే..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 1:42 PM

Share

Clashes in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నేతల మధ్య ఘర్షణను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ వివాదంలో అరెస్టుల పర్వం మొదలు పెట్టింది. తాడిపత్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డ్రైవర్ రమణ, ఆయన అనుచరులైన ఓబుల రెడ్డి, కేశవ రెడ్డి, ఉప్పలపాడు రవి, బాబా లను పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రంలోగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా పోలీసులు అధికారులు ధృవీకరించారు.

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఇరు పక్షాల నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆ ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దాంతో అక్కడ ఏ క్షణం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంది. ఘర్షణలకు కారణమైన ఇరు పక్షాలకు చెందిన నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసింది.

Also read:

AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. స్వయంగా విచారణకు హాజరవ్వాలంటూ ఆ ఇద్దరికీ నోటీసులు..

Earthquake Croatia : పెట్రింజాలో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు.. ఆరుగురు మృతి..