PM Modi: లేపాక్షి ఆలయంలో మార్మోగిన రామనామం.. భక్తి పారవశ్యంలో ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో..

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు. అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు.

PM Modi: లేపాక్షి ఆలయంలో మార్మోగిన రామనామం.. భక్తి పారవశ్యంలో ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో..
PM Modi

Updated on: Jan 16, 2024 | 9:27 PM

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు. అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి హారతి ఇచ్చారు. ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ‘శ్రీరామ జయ రామ’ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన కీర్తలను ఆలపిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశ్వీరచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. సుమారుగా 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు ప్రధాని మోదీ. లేపాక్షి ఆలయ చరిత్ర, దీనికి ఉన్న విశిష్ఠత గురించి అధికారులు మోదీకి వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం, ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం, ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో కొనసాగుతోంది.

వీడియో చూడండి..

ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలు బొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మోదీ ఆసక్తికరంగా తిలకించారు. తర్వాత జరిగిన నాసిన్ ఆరంభ కార్యక్రమంలో లేపాక్షి ఆలయం సందర్శన గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ.

పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్‌ను ప్రధాని ప్రారంభించారు. ప్రధాని పర్యటలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. పీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..