Alluri Sita Rama Raju Statue Inauguration Highlights: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi). భీమవరంలో జరగనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభకు మోడీ హాజరుకానున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.
ప్రధాని ప్రసంగంలోని మరిన్ని విశేషాలను ఈ కింది వీడియోలో చూడండి..
మన్యం వీరుడి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. రూ. 30 కోట్లతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు ప్రధాని.
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్ఠలికి చేరుకోనున్నారు. అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మన్యం వీరుడి వారుసులతో ముచ్చటించనున్నారు. ప్రధాని వెంట గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఉన్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన వెంట సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు.
గన్నవరం విమానశ్రయం వద్ద ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ హల్‌చల్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో బ్లాక్ బెలూన్లు, ప్లకార్డ్ పట్టుకొని గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సుంకర పద్మ శ్రీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే చేతుల్లో వున్న బ్లాక్ బెలూన్లు పగలకొట్టి, విమానాశ్రయం ప్రధాన గేట్ వద్ద కూర్చొని నిరసనకు దిగే ప్రయత్నం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆయనకు సీఎం జగన్, స్వాగతం పలికారు. అనంతరం ఒకే హెలికాప్టర్ లో మోడీ, గవర్నర్, సీఎం భీమవరం బయలుదేరనున్నారు.
గన్నవరం విమానశ్రయం వద్ద ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ హల్‌చల్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో బ్లాక్ బెలూన్లు, ప్లకార్డ్ పట్టుకొని గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సుంకర పద్మ శ్రీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే చేతుల్లో వున్న బ్లాక్ బెలూన్లు పగలకొట్టి, విమానాశ్రయం ప్రధాన గేట్ వద్ద కూర్చొని నిరసనకు దిగే ప్రయత్నం చేశారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణపై ఆయన మనవలు, మనవరాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరిని స్వయంగా తాము చూడకపోయినా.. ఆయన గురించి చెబుతుంటే చాలా గర్వంగా ఉంటుందని ఉప్పొంగిపోయారు.
మరో వైపు గుంటూరులో ఎంపీకి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంపీ రఘురామ గో బ్యాక్ అంటూ రైల్వే స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. ఏపీలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు ఎంపీ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు కోసం కేటాయించిన ఇళ్లు కూడా ఇవ్వకుండా చేశారని ఆరోపించారు.
ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని సభకు వెళ్లాలని అనుకున్నా మధ్యలోనే విరమించుకున్నారు. లింగంపల్లి నుంచి ట్రైన్‌లో వెళ్లేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే భీమవరంలో పోలీసులు కార్యకర్తలను మరింత ఇబ్బంది పెడుతారన్న ఉద్దేశంతో బేగంపేట్‌లోనే దిగి పోయారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ర్యాలీ తీసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. దాదాపు 55 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారన్నారు ఎంపీ.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. చిరంజీవిని గజమాలతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అందిన ఆహ్వానం మేరకు చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
గన్నవరం ఎయిర్‌పర్టులో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వస్తున్న మోడీకి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని, సీఎం,గవర్నర్ హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు.
*రూ.3 కోట్ల వ్యయం
*15 టన్నుల బరువు
*30 అడుగుల పొడవు
ప్రధాని రాక నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు. ఎస్పీజీ పోలీసులు విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమతి ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.
భీమవరం పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు..’ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరుతున్నాను. అక్కడ అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు మోడీ.
Leaving for Bhimavaram to attend a very special programme- the 125th birth anniversary celebrations of the great freedom fighter Alluri Sitarama Raju. Will also unveil a bronze statue of Alluri Sitarama Raju. This will enhance the Azadi Ka Amrit Mahotsav celebrations.
— Narendra Modi (@narendramodi) July 4, 2022
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి గన్నరవం ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. భీమవరం ASRనగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల వాహనాలను మళ్లిస్తున్నారు.
*ఉదయం 9.20కి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఏపీకి బయలుదేరనున్నారు మోడీ.
*10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
* అక్కడి నుంచి గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి ఒకే హెలికాప్టర్ లో భీమవరానికి బయలుదేరనున్నారు.
* 10.55 గంటలకు భీమవరం చేరుకోనున్నారు ప్రధాని
ప్రధాని నరేంద్రమోడీ మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనతో పాటు మంత్రి తలసాని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానికి వీడ్కోలు పలకనున్నారు. కాగా ప్రధాని రాక సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానమంత్రి మోదీ పాల్గొనే ప్రధాన వేదిక పై 11 మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు.ప్రధాని, గవర్నర్, కేంద్రమంత్రి, సీఎం సహా మరో ఏడుగురికి అవకాశం కల్పించనున్నారు. ఇక వేదిక సమీపంలో వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. వేదికకు రెండు వైపులా మహిళలు , పురుషులకు వేర్వేరు గ్యాలరీలు ఉండగా.. ఒక్కో గ్యాలరీలో 500మందికి సిట్టింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఉన్నాయి.
సభకు వచ్చే వారికి సెల్ ఫోన్లు అనుమతి లేదు