CM Chandrababu: 16న ఏపీ పర్యటనుకు ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

ఈనెల 16న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రులు, అధికారులు, పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

CM Chandrababu: 16న ఏపీ పర్యటనుకు ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu PM Modi

Updated on: Oct 09, 2025 | 1:19 AM

ఈనెల 16న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రులు, అధికారులు, పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు.

కాగా 16న మొదటగా కర్నూల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తర్వాత శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన మల్లికార్జున స్వామివారిని దర్శించుకోన్నారు. తర్వాత ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొననున్నారు.

ఇదిలా ఉండగా అధికారులతో సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేయాలని అధికారులకు చూసించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సభకు వచ్చే వారికి ఆహారం, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.