Chinese Pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. ఏపీలోనూ అనుమానాస్పద పిజియోన్స్‌ గుర్తింపు..

| Edited By: Anil kumar poka

Jan 05, 2022 | 4:36 PM

దేశంలో పావురాళ్ల కలకలం రేపుతున్నాయి. నిన్న ఒడిశా..ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తి, కడప శాంతికి చిహ్నమైన ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? డ్రాగన్‌ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా..?

Chinese Pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. ఏపీలోనూ అనుమానాస్పద పిజియోన్స్‌ గుర్తింపు..
Follow us on

దేశంలో పావురాళ్ల కలకలం రేపుతున్నాయి. నిన్న ఒడిశా..ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తి, కడప శాంతికి చిహ్నమైన ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? డ్రాగన్‌ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా..? ఇవి గూఢాచారి పావురాళ్లా..? ఈ పావురాళ్ల వెనుక మిస్టరీ ఏంటి..?   కాగా ఏపీలోని ప్రకాశం, కడప జిల్లాలోనూ ఈ అనుమానాస్పద పావురాలు కలకలం రేపాయి.   ప్రకాశం జిల్లా చీమకుర్తి  లో దొరికిన పావురం  కాలిపై ఎల్లో కలర్‌ రబ్బర్‌ ట్యాగ్‌..AIR 2019 2207 అని రాసి ఉంది. కాగా ఇదికూడా చైనాకు చెందిన పావురమేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పావురాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా టీవీ9లో పావురాల కథనం చూసి కడప జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్‌కు అనే యువకుడు ఈ అనుమానాస్పద పావురాల గురించి మరో సమాచారమిచ్చాడు. నాలుగు నెలల క్రితం తిరుపతి నుంచి కడపకు వచ్చే మార్గంలో అతనికి ఈ ట్యాగ్ లు వేసి ఉన్న పావురం దొరికినట్లు చెబుతున్నాడు. దీని ఒక కాలి ట్యాగ్ పై LOFT26, రెండవ కాలిపై LOFT 26 IN 2021 అని రాసి ఉందని ఆ యువకుడు చెబుతున్నాడు. అయితే డిసెంబర్‌లో అది మరణించిందని ప్రసన్న చెప్పుకొచ్చాడు.

కాగా నేటి ఉదయం ఇలా అనుమానాస్పందంగా తిరుగుతున్న కొన్ని పావురాలను ఒడిశాలో గుర్తించారు. వాటి కాలికి ఉన్న ఆ పచ్చ కట్టు ఏంటా అని ఆరా తీశారు. అనుమానం వచ్చిన ఒడిశా వాసులు ఈ పావురాన్ని పట్టి ఆ కాలికున్న కట్టు విప్పి చూశారు. ఆ ట్యాగ్ లో VHF- వైజాగ్ 19742021 అని ముద్రించి ఉంది. స్థానికులిచ్చిన సమాచారం తో పోలీసులు ఈ పావురాన్ని పట్టుకెళ్లారు. ఇక పూరీ జిల్లా- హరే కృష్ణ పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామస్తులకు సోమవారం దొరికిన పావురం కాలికి.. మరో ఆశ్చర్యకరమైన ట్యాగ్ కనిపించింది. దీని కాలికి 37 అనే సంఖ్యతో పాటు.. చైనా లిపితో కూడిన అల్యూమినియం ట్యాగ్ కనిపించింది. మంగళవారం నాడు ఈ పావురాన్ని గుర్తించి.. తమ వెంట పట్టుకు పోయారు పూరీ పోలీసులు.

కాగా సరిహద్దులో ఇండియాతో కయ్యానికి చైనా కాలు దువ్వుతోంది. పాకిస్థాన్‌ కూడా మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇలా విదేశీ పావురాలు, వాటికున్న చిత్ర విచిత్ర ట్యాగ్‌లు సంచలనం కలిగిస్తున్నాయి. కాగా చైనా తాము ప్రయోగించే రాకెట్ లాంచర్ల దూరాన్ని పరీక్షించేందుకే ఇలా చేస్తోందనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ పావురాలతో ఏం చేస్తున్నారు. ఇవి ఎవరికి సమాచారం మోసుకుపోతున్నాయి. ఇందులో ఏదో పెద్ద డ్రాగన్ కుట్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు స్థానిక నిఘా వర్గాలు.

Also Read:

Viral Video: వామ్మో.. బామ్మ డాన్స్ మాములుగా లేదుగా.. రోడ్డుపైనే చిందులు.. వీడియో చూస్తే..

Meena : హీరోయిన్ మీనా కుటుంబంలో కరోనా కలకలం.. కొత్త అతిథి వచ్చిందంటూ ఇంట్రస్టింగ్ ట్వీట్..

Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు పొరపాటును కూడా చేయొద్దంటే.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!