Andhra Pradesh: మీరు మీ చిన్నారులకు వ్యాక్సిన్ వేయిస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! కాలం చెల్లిన వాటితో..

| Edited By: Jyothi Gadda

Nov 03, 2023 | 8:37 PM

Vizianagaram: ప్రజాప్రతినిధుల ఆగ్రహంతో స్పందించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు నలుగురితో కూడిన ఒక కమిటీని నియమించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రి మెడికల్ షాప్స్ లో ఎప్పటికప్పుడు మెడిసిన్స్  కాల పరిమితి ని పరిశీలించి కాలం చెల్లితే వెంటనే వాటిని షాప్ లో నుండి తొలగించాలి. అది తప్పనిసరి. అలా కాలం చెల్లిన మెడిసిన్ షాప్ లో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకోసం ఫార్మా అధికారులు ఎప్పటికప్పుడు మెడికల్ షాప్స్ ను తనిఖీలు కూడా చేస్తుంటారు. అయితే

Andhra Pradesh: మీరు మీ చిన్నారులకు వ్యాక్సిన్ వేయిస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! కాలం చెల్లిన వాటితో..
Expired Vaccinations
Follow us on

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తుంది. పది నెలల వయసు దాటిన ఓ చిన్నారికి కాలం చెల్లిన వ్యాక్సిన్ వినియోగించి చర్చకు తెర లేపారు వైద్య సిబ్బంది. జిల్లాలోని దత్తిరాజేరు మండల పి హెచ్ సి పరిధిలో మొత్తం పది సచివాలయ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఆరు ఆరోగ్య కేంద్రాలకు మండల ఫార్మసిస్ట్ మిస్సెల్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్స్ ను సరఫరా చేశాడు పి హెచ్ సి ఫార్మసిస్ట్ సీతారాం. ఈ మిస్సైల్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ ను ఎనిమిది నెలల వయస్సు దాటిన చిన్నారులకు వేస్తారు. చిన్నారులకు తట్టు, దద్దుర్లు వంటి చర్మ సంభందిత జబ్బులు రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఈ వ్యాక్సిన్ వేయటం తప్పనిసరి. ఈ క్రమంలోనే దత్తిరాజేరు పిహెచ్ సి పరిధిలో ఉన్న ఆరు ఆరోగ్య కేంద్రాలకు కూడా ఈ వ్యాక్సిన్ ను సరఫరా చేశారు.

అయితే నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేసే సమయంలో ముందుగా బ్యాచ్ నెంబర్, కాలపరిమితిని పరిశీలించి పిహెచ్ సి నుండి గ్రామాలకు సరఫరా చేయాలి. అయితే దత్తిరాజేరు పిహెచ్ సి లో ఉన్న ఫార్మసిస్ట్ సీతారాం మాత్రం అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 2023 జూలై లోనే కాలపరిమితి అయిపోయినప్పటికి గమనించకుండా ఎమ్ అర్ వ్యాక్సిన్ ను ఆరు గ్రామ సచివాలయ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేశాడు. ఈ ఆరింటి లో ఐదు గ్రామాల ఏఎన్ఎం లు కాలపరిమితి ముగిసినట్టు గుర్తించి వెనక్కి పంపారు. అయితే ఇందులో పెదకాద సచివాలయం ఏ ఎన్ ఎం మాత్రం అక్కడ కూడా కాలపరిమితి తేదీ పరిశీలించకుండా ఏడాది వయస్సున్న ఓ చిన్నారికి వేసింది. వ్యాక్సిన్ వేసిన తరువాత విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెంది జరిగిన వ్యవహారం పై ఆరోగ్య సిబ్బందిని నిలదీశారు. దీంతో ఈ వ్యవహరం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల ఆగ్రహంతో స్పందించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు నలుగురితో కూడిన ఒక కమిటీని నియమించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రి మెడికల్ షాప్స్ లో ఎప్పటికప్పుడు మెడిసిన్స్  కాల పరిమితి ని పరిశీలించి కాలం చెల్లితే వెంటనే వాటిని షాప్ లో నుండి తొలగించాలి. అది తప్పనిసరి. అలా కాలం చెల్లిన మెడిసిన్ షాప్ లో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకోసం ఫార్మా అధికారులు ఎప్పటికప్పుడు మెడికల్ షాప్స్ ను తనిఖీలు కూడా చేస్తుంటారు. అయితే దత్తిరాజేరు పిహెచ్ సి లో మాత్రం అలా జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఫార్మసిస్ట్ నిర్లక్యంగా వ్యవహరించి కాల పరిమితి చెక్ చేయకుండా సరఫరా చేశాడు. అక్కడ నుండి గ్రామానికి చేరుకుంటే ఆ గ్రామ
ఏ ఎన్ ఎమ్ కూడా వ్యాక్సిన్ కాల పరిమితి చెక్ చేయకుండా చిన్నారికి వినియోగించింది. కాలం చెల్లిన మెడిసిన్స్ లేదా వ్యాక్సిన్స్ వినియోగిస్తే అది వికటించి ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. కానీ వైద్య సిబ్బంది నిర్లక్యంగా వ్యవహరించి ఏడాది చిన్నారికి కాలం చెల్లిన వ్యాక్సిన్ వినియోగించారు. దీంతో వెంటనే చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు జరిపిన తరువాత ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదని తెలిపారు వైద్యులు. జిల్లాలో జరిగిన వైద్య సిబ్బంది నిర్వాకం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కొనే ముందు అలాగే వినియోగించే ముందు తప్పనిసరిగా వినియోగదారులు కాలపరిమితి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు వైధ్యాధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..