Free Petrol: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఏపీలో ఈ బంకులో ఉచితంగా పెట్రోల్‌.. ఎగబడుతున్న జనం.. !

Free Petrol: అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ఏపీలోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం వస్తే చమురు ధరలు పెరగడమే కాకుండా, సరఫరా నిలిచిపోతుందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్ద బారులు తీరారు. భయంతో ముందస్తుగా కొనడం కారణంగా రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో ఓ బంకులో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారు..

Free Petrol: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఏపీలో ఈ బంకులో ఉచితంగా పెట్రోల్‌.. ఎగబడుతున్న జనం.. !
Free Petrol

Updated on: Apr 27, 2026 | 11:24 AM

Free Petrol: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌ కొరత ఏర్పడుతోంది. ఏపీలో అయితే మరీ దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ కొరత ఏర్పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి పెట్రోల్‌ కొరతపై గల కారణాలను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ పెట్రోల్‌ బంకుల్లో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్‌ అందిస్తోంది. తిరుపతిలో చోటు చేసుకున్న ఆ ఆసక్తికర పరిణామంపై చర్చ జరుగుతోంది. తనపల్లి దగ్గర ఓ పెట్రోల్‌ బంకులో వాహనదారులకు ఉచితంగా పెంట్రోల్‌ అందిస్తున్నారు. టూవీలర్‌ వాహనాలకు ఉచితంగా లీటర్‌ పెట్రోల్‌ సరాఫరా చేస్తున్నట్లు బంకు యజమాని రాజేష్‌రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో దాదాపు 421 బంకులు (సుమారు 10 శాతం) స్టాక్ లేక బోర్డులు తిప్పేయడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా 50 శాతం పైగా పెరిగింది. సాధారణంగా రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది 10,345 కిలో లీటర్లకు చేరింది. డీజిల్ విక్రయాలు కూడా 9,048 కిలో లీటర్ల నుండి ఏకంగా 14,156 కిలో లీటర్లకు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us