Petrol Diesel Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు.. ఏపీలో మాత్రం కనిపిస్తున్నపెరుగుదల..

|

Mar 28, 2021 | 7:38 AM

నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో .. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీ వడ్డింపు మాత్రం ఆగిపోయింది.. ఇదే సమయంలో.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ‌త పది పదిహేను

Petrol Diesel Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు.. ఏపీలో మాత్రం కనిపిస్తున్నపెరుగుదల..
Follow us on

నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో .. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీ వడ్డింపు మాత్రం ఆగిపోయింది.. ఇదే సమయంలో.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ‌త పది పదిహేను రోజుల్లోనే ముడి చ‌మురు ధ‌ర‌లు 10 శాతం మేర తగ్గిపోయాయి.. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. అక్కడే ఆగిపోయాయి… అయితే గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు చెక్‌ పడుతూనే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ధరల్లో తగ్గుదల కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో కొంతమేర ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది. మరి రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందా? లేదో చూడాలి. ఆదివారం  దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.78 ఉండగా.. డీజిల్‌ ధర రూ.81.10 వద్ద కొనసాగుతోంది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.19గా ఉండగా డీజిల్‌ రూ. 88.20గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.82గాఉండగా.. డీజిల్‌ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 86.10గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.39గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.45 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.51గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.56గా నమోదైంది. విజయవాడలో ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.82 (శనివారం  రూ.96.71) కాగా.. సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.94 (శనివారం  రూ.95.74) గా  ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Silver Price Today: బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు తగ్గాయి.. ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

Farmers Protest: ఆగ్రహంతో రెచ్చిపోయిన రైతులు.. నడిరోడ్డుపై ఎమ్మెల్యే బట్టలు చింపి చితకబాదారు..