అనకాపల్లి జిల్లా ప్రజల గుండెలదిరిపోయే వార్త ఇది. అవును, అనకాపల్లి ప్రజలు ఇప్పుడు డేంజర్‌లో ఉన్నారు. ఇన్నాళ్లూ కాకినాడ ప్రజలను హడలెత్తించిన పెద్దపులి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే ఒక ప్రాణం తీసేసి వార్నింగ్ కూడా ఇచ్చేసింది టైగర్. నెలరోజులుగా కాకినాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెంగాల్ టైగర్ రూట్ మార్చింది. ఇప్పటివరకు కాకినాడ జిల్లాలోనే తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి, ఇప్పుడు మరో జిల్లాలోకి ఎంటరైంది. అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లాను విడిచిపెట్టిన పెద్దపులి అనకాపల్లి జిల్లాలోకి ఎంటరైంది. ఎంటర్ కావడమే కాదు, తానొచ్చంటూ హెచ్చరికలు పంపింది. యలిమంచిలిపాలెం రేంజ్ ఫారెస్ట్‌లోకి ఎంటరైన టైగర్ కోట ఊరట్ల మండలం టి.జగ్గంపేట దగ్గర గేదెపై ఎటాక్ చేసి చంపేసింది. పగ్ మార్క్స్ ఆధారంగా పులి కోసం వేట కొనసాగిస్తున్నారు ఫారెస్ట్ టీమ్. అనకాపల్లి తర్వాత విశాఖ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో బోర్డర్స్‌లో బోన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. నిన్నటివరకు కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగించింది. తుని మండలంలోని మరువాడ గ్రామ శివారులోని జీడితోటలో పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ధర్మరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..