పెనుగొండ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌ – పార్థసారథి పరస్పరం తిట్ల దండకం

|

Nov 15, 2021 | 10:49 AM

అనంతపురం జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

పెనుగొండ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌ - పార్థసారథి పరస్పరం తిట్ల దండకం
Penugonda Tension
Follow us on

Penugonda Nagara Panchayati Election: అనంతపురం జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ మాధవ్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అప్పుడే వచ్చిన పార్థసారథి ఇద్దరు నడుచుకుంటూనే పరస్పరం తిట్టుకున్న ఇద్దరి నేతల్ని సముదాయించడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు. అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లిన గోరంట్ల ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. సమాచారం తెలిసిన వెంటనే పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎంపీ లెక్క చేయకుండా వెళ్లిపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరస్పరం దూషించుకున్నారు.

లోకల్‌గా ఎలక్షన్స్ జరుగుతుంటే ఎంపీ ఎలా వస్తారు అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి. సిగ్గు ఉండాలంటూ ఎంపీ మాధవ్ పై తీవ్రస్థాయిలో స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా మీదే పరిపాలన అన్నట్లుగా దౌర్జన్యం చేయవద్దంటూ మాటకుమాట విసిరారు. నువ్వు డబ్బు మద్యం పంచావంటూ పార్థసారథిపై మాధవ్ ఆరోపణలు చేస్తే.. చీరలు, మందు పంచింది ఎవరో అందరికీ తెలుసంటూ పార్థసారథి రివర్స్ అయ్యారు. పోలీసులు సర్దిచెబుతున్నా.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దర్నీ చెరోవైపు నడిపించుకుంటూ, కంట్రోల్‌ చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు..