Ex MLA Adeep Raj: నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు బాబో అంటున్న ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరు?

| Edited By: Subhash Goud

Jun 24, 2024 | 6:25 PM

తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు వైఎస్ఆర్సీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. నిన్న రాత్రి డిన్నర్ తర్వాత ఫుడ్ పోయిజన్ అయ్యి ఇబ్బందిగా ఉంటే ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో చేరి డిశ్చార్జి కూడా అయ్యానంటూ ఓ విడియో కూడా విడుదల చేశారు అదీప్. నిన్న సాయంత్రం పెందుర్తి వైఎస్ఆర్సీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని..

Ex MLA Adeep Raj: నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు బాబో అంటున్న ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరు?
Annamreddy Adeep Raj
Follow us on

తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు వైఎస్ఆర్సీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. నిన్న రాత్రి డిన్నర్ తర్వాత ఫుడ్ పోయిజన్ అయ్యి ఇబ్బందిగా ఉంటే ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో చేరి డిశ్చార్జి కూడా అయ్యానంటూ ఓ విడియో కూడా విడుదల చేశారు అదీప్. నిన్న సాయంత్రం పెందుర్తి వైఎస్ఆర్సీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, కావాలంటే ఎవరైనా కనుక్కోవచ్చన్నారు. పార్టీ ను బలోపేతం చేసే షెడ్యూల్ కు సిద్ధం అవుతున్నాననీ కూడా చెబుతున్నారు అదిప్ రాజ్. తన అభిమానులు అపోహలు నమ్మవద్దనీ, ఆరోగ్యంగానే ఉన్నానంటూ వీడియోలో వివరించారు అదీప్.

ఇది కూడా చదవండి: Petrol Price: త్వరలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.20 వరకు తగ్గనుందా? కేంద్రం ప్రతిపాదన ఏంటి?

వీడియో వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?

సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి విశాఖలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో వచ్చిన ఒక మెసేజ్ అందర్నీ షాక్ గురిచేసింది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్లీపింగ్ పిల్స్ తీసుకొని రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఈ తెల్లవారుజామున చూసిన కుటుంబ సభ్యులు మూడు గంటల సమయంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారని ఆ మెసేజ్ సారాంశం. దాంతోపాటు కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని.. దీనిపై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ కాబోతోంది అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై మీడియా ప్రతినిధులు హాస్పిటల్ కి.. సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి విచారించగా ఎలాంటి మెడికో లీగల్ కేసు నమోదు కాలేదని తెలిసింది. అదే సమయంలో ఆయనకి ఊపిరి కొంత ఇబ్బందికరంగా ఉంటే హాస్పిటల్ కి వచ్చి చికిత్స చేయించుకుని వెళ్లారని ఆ హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. అయినప్పటికీ కచ్చితంగా ఎవరూ నిర్ధారించకపోవడంతో ఆ మెసేజ్ వాట్సప్ గ్రూప్స్ ద్వారా చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పాకింది. దీంతో అనేక ఫోన్లు కూడా సంబంధిత హాస్పిటల్ తో పాటు పెందుర్తి పోలీస్ స్టేషన్ తో పాటు అదీప్ రాజ్ కుటుంబసభ్యులకు కూడా వచ్చాయి.


వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసిన అదీప్ రాజ్

అదీప్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ మెసేజ్ వాట్స్అప్ గ్రూపులో విస్తృతంగా ప్రచారం కావడం, రాష్ట్రమంతటా అన్ని గ్రూపుల్లో ఈ మెసేజ్ చేరడంతో పెద్ద ఎత్తున ఫోన్స్ రావడంతో స్వయంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓపిక తెచ్చుకుని మరీ ఒక వీడియో విడుదల చేశారు అదీప్ రాజ్. తనపై జరుగుతున్న ప్రచారం దుష్ప్రచారం అని ఆపోహలు నమ్మొద్దు అంటూ ఆ వీడియోలో పేర్కొన్న ఆయన నిన్న సాయంత్రం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ కు కూడా వెళ్ళామని వివరించారు. అయితే డిన్నర్ లో ప్రాబ్లం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందో, ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ కడుపునొప్పి ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారని మళ్లీ కొన్ని గంటలలోనే డిశ్చార్జ్ అయ్యి వచ్చేసానని.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని విశ్రాంతి తీసుకుంటున్నానంటూ వివరించారు అదీప్. రెండు మూడు రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటానని కూడా వివరించారు. ఆ వీడియో తో ఆయన అభిమానుల్లో ఆందోళన తగ్గి, అపోహలు కూడా తొలగాయి.

ఇది కూడా చదవండి: Annual Salary: గౌతమ్ అదానీకి రూ.9.26 కోట్ల జీతం..మరి ముఖేష్ అంబానీకి వేతనం ఎంతో తెలుసా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి