Paytm Vijay shekhar: ఇటీవల చిన్న చిన్న సంస్థలు కూడా పెట్టుబడుల సమీకరణల కోసం పబ్లిక్ ఇష్యూకు వెళుతున్నారు. గతకొన్ని రోజుల క్రితమే ఫుడ్ డెలివరి యాప్ జొమాటో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనికి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మరో పేమెంట్ యాప్ పేటీఎం కూడా పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ రూ. 18, 300 కోట్ల సమీకరణే లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. ఇందులో భాగంగా రూ. 8300 కోట్ల కోసం షేర్లు జారీ చేశారు. ఈ సేల్ కింద రూ. 10,000 కోట్లు విలువైన షేర్లు విక్రయిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఐపీఓ నేడు నవంబర్ 8న మొదలై, 10న ముగియనుంది. ఇదిలా ఉంటే పేటీఎం సంస్థ ఐపీఓకు వెళ్లిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డిని కలిసిన విజయ్ శేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పేటీఎమ్ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
ఇక పేటీఎం ఐపీ ఇష్యూలో భాగంగా ధరలశ్రేణిని రూ.2080- 2150గా నిర్ణయించారు. మొత్తం ఇష్యూలో 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయిస్తారు. రిటైలర్లు కనీసం 6 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇష్యూ గరిష్ఠధర ప్రకారం చూస్తే ఇందుకు రూ.12,900 అవుతుంది. గరిష్ఠంగా ఒకరు 15 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. అంటే రూ.1,93,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Just met Sh. Jawahar Reddy Executive Officer, Tirumala Tirupati Devasthanams (#TTD) in Tirupati as I have come here to seek blessing of God for all of @Paytm family. ?????? pic.twitter.com/i7RIep8sLk
— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 8, 2021
Also Read: Viral News: రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత సీన్ నెక్ట్స్ లెవల్
IAF Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?