Mark Shankar: పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు స్పెషల్‌ ట్రీట్‌మెంట్.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్‌!

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు మార్క్ శంకర్‌కు అందించిన వైద్యం ఖర్చుపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే మార్క్‌ శంకర్‌కు వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ట్రీట్‌మెంట్‌కు కేవలం రూ.4 నుంచి 30వేలు మాత్రమే ఖర్చు అవుతుందని సమాచారం.

Mark Shankar: పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు స్పెషల్‌ ట్రీట్‌మెంట్.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్‌!
Mark Shankar

Updated on: Apr 12, 2025 | 10:22 AM

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గాయాలు నుంచి కోలుకున్న మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు తెలుస్తోంది.  అయితే మార్క్‌ శంకర్‌ హాస్పిటల్‌ ఖర్చులపై ప్రస్తుతం ఓ చర్చ నడుస్తోంది. మార్క్‌ శంకర్‌కు అందించిన వైద్యానికి లక్షల్లో ఖర్చు అయినట్టు అందరూ భావిస్తున్నారు.

స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావ‌డంతో దట్టమైన నల్లటి పొగ పీల్చినట్టు వైద్యులు చెబుతున్నారు. దీని కోసం వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్‌మెంట్‌ని మార్క్ శంక‌ర్‌కి అందించిన‌ట్టు తెలుస్తోంది. ఇదేదో కొత్త ట్రీమ్‌మెంట్‌లా ఉంది దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యుంటాయో అనుకుంటున్నారేమో కాదా..కానీ ఈ ట్రీట్‌ మెంట్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుస్తే మీరు షాక్ అవుతారు.

ఈ బ్రోన్కో స్కోపీ ట్రీట్‌మెంట్‌కు అందించేందుకు కేవలం రూ.4 వేల నుండి 30 వేలు మాత్రమే వైద్యులు ఛార్జ్ చేస్తారంటా. అసలు ఈ ట్రీట్‌ మెంట్‌ ఎందుకు చేస్తారంటే. పేషెంట్‌ ఏవైన విషవాయువులు పీల్చుకొని అవి లంగ్స్ లోకి చేరితే ..వాటిని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించేందుకు ఈ ట్రీట్‌మెంట్ చేస్తారట. అయితే ప్రమాదం జ‌రిగిన 30 నిమిషాల లోపే ఈ ట్రీట్‌మెంట్‌ అందించాలని.. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్‌ నల్లటి పొగను పీల్చారని దాన్ని తొలగించేందుకు ఈ ట్రీట్‌మెంట్ అందింనట్టు తెలుస్తోంది.

ఇక తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సింగపూర్‌ బయల్దేరి వెళ్లారు. హాస్పిటల్‌లో ఉన్న మార్క్ శంకర్‌ను చూసి. అక్కడి వైద్యుల‌తోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య ప‌రిస్థితిపై అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.  పవన్ కల్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్‌ వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతన్ని హైదరాబాద్‌ తీసుకురావ‌డానికి మ‌రో రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..