
కలిసుందాం రా అనే స్లోగన్‌ని మళ్లీ రిపీట్ చేశారు పవన్‌కల్యాణ్. సీఎం సీటు అనే పాత కండీషన్‌ని ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేశారు. కాకపోతే కొత్త కండిషన్లతో ముందుకొచ్చారు. ముందటి కంటే బలం పెరిగింది… జనసేన ఓటు బ్యాంకు డబుల్ అయిందంటూనే పొత్తు చర్చలకు సిద్ధం అనేశారు. రాయబారాల సీజన్ ముగిసిపోయింది… ఇక మిగిలింది బేరసారాలే అంటూ సిగ్నల్స్ ఇచ్చేశారు పవన్.
సీఎం సీటు కూడా పవన్ విష్‌లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయా లేదా అనే క్లారిటీ లేకపోయినా… పవన్‌కి రెండున్నరేళ్లు, టీడీపీకి రెండున్నరేళ్లు… అనే డీల్ కూడా కుదిరిందనే చర్చ జరిగింది. అయితే సీఎం డిమాండ్‌ని పక్కన పెట్టిన పవన్.. వైసీపీ విముక్త సర్కారే తన లక్ష్యమన్నారు. అయితే పవన్ నిర్ణయంతో అటు కాపుల్ని ఇటు అభిమానుల్ని అవమానించారంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుసుకున్నారా? అందుకే డిమాండ్లు, అల్టిమేటమ్‌లు పక్కనెట్టి.. కలిసి నడుద్దాం అనే సంకేతాలిచ్చారా? సీఎం సీటు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులపై పవన్ క్లిస్టర్ క్లియర్‌గా క్లారిటీ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులన్నది పవన్ లెక్క. ఎన్నికల్లో ప్రభావం చూపే అన్ని పార్టీలతో మాట్లాడతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పెద్ద పార్టీలు పొత్తులతోనే ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. మరి.. జనసేనకు టీడీపీ, బీజేపీ షేక్‌హ్యాండ్ ఇస్తాయా? వేరే పార్టీలు కూడా కలిసొస్తాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..