గోదావరి నది మధ్యలో గంటన్నర సేపు ఏం జరిగింది..?

| Edited By:

May 10, 2019 | 4:38 PM

ఉభయగోదావరి జిల్లాల్లో.. బోట్ల నిర్వాహకుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గోదావరి నదిపై పడవ ప్రయాణం అంటేనే.. వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో.. కెపాసిటీకి మించి జనాన్ని ఎక్కించుకుని, నిర్లక్ష్యంగా నడిపి.. ఎన్నో బోట్లు బోల్తా కొట్టి.. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లా వశిష్టా గోదావరి నది దగ్గర రాత్రి పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు నుంచి వంద మందితో నర్సాపురం బోటు బయలుదేరింది. అయితే.. డీజిల్ […]

గోదావరి నది మధ్యలో గంటన్నర సేపు ఏం జరిగింది..?
Follow us on

ఉభయగోదావరి జిల్లాల్లో.. బోట్ల నిర్వాహకుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గోదావరి నదిపై పడవ ప్రయాణం అంటేనే.. వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో.. కెపాసిటీకి మించి జనాన్ని ఎక్కించుకుని, నిర్లక్ష్యంగా నడిపి.. ఎన్నో బోట్లు బోల్తా కొట్టి.. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు.

తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లా వశిష్టా గోదావరి నది దగ్గర రాత్రి పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు నుంచి వంద మందితో నర్సాపురం బోటు బయలుదేరింది. అయితే.. డీజిల్ కొట్టించకుండా.. బోటును నడపడంతో.. గోదావరి మధ్యలోకి వెళ్లగానే నిలిచిపోయింది. అయితే.. నదిలో ఆ సమయంలో గాలి ఎక్కువగా వీస్తుండటంతో.. బోటు సముద్రం వైపునకు కొట్టుకు వెళ్లిపోయింది. దాదాపు 120 మీటర్లు.. సముద్రం వైపుకు కొట్టుకు వెళ్లింది. దీంతో భయాందోళన చెందిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు.

గోదావరి మధ్యలో గంటన్నర పాటు నది మధ్యలోనే బోటు నిలిచిపోయింది. సముద్రం వైపునకు బోటు కొట్టుకు వెళ్తుండగా.. ముందుగా మత్స్యకారులు నది మధ్యలో ఏర్పాటు చేసిన కర్రలు, వలలు అడ్డుతగిలి బోటు ఆగిపోయింది. దీంతో వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సమయంలోనే బోటులో ఉన్న ప్రయాణికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాటు పడవలో వెళ్లి.. బోటుకు డీజిల్ వేసి.. ఆ బోటులోని ప్రయాణికుల్ని మరొక బోటులోకి ఎక్కించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.