Vijaysai Reddy Meet Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక భేటీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోవైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు.

Vijaysai Reddy Meet Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక భేటీ..!
Vijaysaireddy

Updated on: Dec 09, 2021 | 5:57 PM

MP Vijaysai Reddy Meet PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోవైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పార్లమెంట్‌లోని ప్రధానిన ఆయన కార్యాలయంలో కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వివరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా ఆయనను కోరారు.ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. అలాగే రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో తుఫాన్ మిగిల్చిన నష్టాలను ప్రధాని మోడీకి ఆయన వివరించినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.


Read Also… Andhra Pradesh: అనంతపురం జిల్లాలో లేడీ చైన్‌స్నాచర్‌ హల్‌చల్‌.. బుర్ఖాలో వచ్చి…