Andhra Pradesh: గ్రామంలో హల్ చల్ చేసింది.. అలసిపోయి చనిపోయింది.. కట్ చేస్తే గ్రామస్తులకు తిప్పలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అరుదైన జంతువు గ్రామంలోకి చొరబడి హల్ చల్ చేసింది. గ్రామమంతా చక్కర్లు కొడుతూ గ్రామస్తులను పరుగులు పెట్టించింది. ఎప్పుడు చూడని జంతువు కావడంతో భయంతో వణికిపోయారు గ్రామస్తులు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామం. రాత్రి ఎనిమిది గంటలు. పల్లెటూరు కావడంతో..

Andhra Pradesh: గ్రామంలో హల్ చల్ చేసింది.. అలసిపోయి చనిపోయింది.. కట్ చేస్తే గ్రామస్తులకు తిప్పలు..!
Pangolin

Edited By:

Updated on: Sep 28, 2023 | 1:31 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అరుదైన జంతువు గ్రామంలోకి చొరబడి హల్ చల్ చేసింది. గ్రామమంతా చక్కర్లు కొడుతూ గ్రామస్తులను పరుగులు పెట్టించింది. ఎప్పుడు చూడని జంతువు కావడంతో భయంతో వణికిపోయారు గ్రామస్తులు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామం. రాత్రి ఎనిమిది గంటలు. పల్లెటూరు కావడంతో అంతా నిద్రకు ఉపక్రమించబోతున్నారు. ఇంతలో ఎప్పుడూ చూడని ఓ భయానకంగా ఉన్న జంతువు గ్రామంలోకి ప్రవేశించింది. విచిత్రమైన అరుపులతో వీధుల్లో తిరుగుతూ హంగామా చేసింది. ఆ అరుపులు ఉన్న కొందరు గ్రామస్తులు ఏం జరుగుతుందో అని హడావుడిగా ఇళల్లో నుండి బయటకు వచ్చి ఆ జంతువును చూశారు. అది చాలా వేగంగా పరుగులు తీస్తుంది. చూడటానికి ఒంటి నిండా పొలుసులతో విచిత్రంగా, గగుర్పాటుగా కనిపించింది.

అయితే ఆ జంతువు ఏంటి? దాని స్వభావం ఏంటి? అది దాడి చేస్తే ఎలా ఉంటుంది? అనే అనేక విషయాలు ఆ గ్రామస్థులకు ప్రశ్నార్థకంగా మారాయి. జంతువు చూడటానికి భయానకంగా ఉండటం, అలాంటి జంతువును చూడటం అదే మొదటిసారి కావడంతో గ్రామస్తులు అంతా కొన్ని గంటల పాటు భయం భయంగా గడిపారు. అయితే కొందరు గ్రామస్తులు ముందుకు వచ్చి ఏదో ఒక విధంగా ఆ జంతువును బందిచాలి, లేకపోతే ఎవరి పై ఎలా దాడి చేస్తుందో కూడా తెలియదు? ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు? అని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై చీకట్లోనే జంతువును బంధించేందుకు నానా అవస్థలు పడ్డారు. ఆ క్రమంలోనే ఆ జంతువు కూడా గ్రామమంతా పరుగులు తీసి తీవ్రంగా అలిసిపోయి కొద్దిసేపటికి అనారోగ్యంతో మృతి చెందింది. జంతువు మృతితో గ్రామస్తులు ఊపిరి కొంత పీల్చుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామస్తులకు అప్పుడే అసలు సమస్య ఎదురైంది.

గ్రామస్తులకు వచ్చిపడిన ఆ సమస్య ఏంటి?

గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని విచారించారు. గ్రామంలో చనిపోయిన జంతువు అరుదైన పాంగోలిన్ అని గుర్తించారు. ఈ జంతువు చాలా అరుదుగా ఉంటుందని తేల్చారు. పాంగోలిన్ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఎవరైనా కొట్టారా? హింసించారా? మాంసం కోసం చంపారా? అని అనేక ప్రశ్నలతో గ్రామస్తులను ఉక్కిరిబిక్కిరి చేశారు అటవీశాఖ అధికారులు. సహజంగా వన్యప్రాణులను హింసించినా, చంపినా, జంతువుల మాంసం తిన్నా చట్టపరంగా కటిన చర్యలు ఉంటాయని, ఏళ్ల తరుబడి జైలు కే పరిమితం కావాల్సి వస్తుందని గ్రామస్తులకు తెలిపారు అధికారులు. దీంతో తమ గ్రామంలో జంతువు చనిపోయింది కాబట్టి అధికారులు ఎవరి పై చర్యలు తీసుకుంటారో అని నానా హైరానా పడ్డారు. ఈ వ్యవహారం చుట్టుప్రక్కల గ్రామాల్లో సంచలనంగా మారింది. ముమ్మర దర్యాప్తు జరిపిన తరువాత పాంగోలిన్ అనారోగ్యంతో మరణించినట్లు ధృవీకరించారు అటవీశాఖ అధికారులు. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. తరువాత పాంగోలిన్ మృతదేహాన్ని గ్రామ పొలిమేరల్లో ఖననం చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..