
కర్నూలు జిల్లా కోడుమూడు పరిధిలోని పూడూరు గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు వేయని కారణంగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. గ్రామంలో ఏళ్ల తరబడి రహదారి సమస్య ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహంగా ఉన్నారు.
మంగళవారం నుంచి నామినేష్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో రచ్చకట్ట వద్ద సమావేశమై ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామంలో దండోరా వేయించారు. తమ ఆడపడచులను తొలికాన్పుకు పుట్టింటికి పిలుచుకురాలేని దుస్థి తి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన నలుగురు గర్భిణులు ఆసుపత్రులకు తరలిస్తుండగా, దారిలోనే ప్రసవించారని తెలిపారు.
ప్రమాదాలకు గురైన గ్రామస్థులను సకాలంలో ఆసుపత్రులకు తరలించలేని కారణంగా ఇప్పటికి ఏడుగురు మృత్యువాత పడ్డారని వాపోయారు. పాతికేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2005లో వెంకాయపల్లె క్రాస్ రోడ్డు నుంచి పూడూరు వరకు తారు రోడ్డు వేశారు. ఆతర్వాత పూడూరు ఇసుక రీచ్‌కు వాహనాలు అధిక లోడుతో ఇష్టారాజ్యంగా తిరిగాయి. రోడ్డంతా గుంతలు పడి శిథిలాస్థవకు చేరింది.
టీడీపీ హయాంలో ఈ ఊరి దారికి రూ.5 కోట్లు మంజూరు చేసింది. కానీ టెండర్ల నిర్వహణలో జాప్యం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 25 శాతం కంటే తక్కువ పనులు జరిగాయన్న కారణంగా రోడ్డు పనులను రద్దు చేశారు. మా ఊరి రోడ్డు బాగా లేదని, అందుకే ఇంటి పట్టాల పంపి ణీ కార్యక్రమానికి రాలేకపోతున్నానని ఎమ్మెల్యే సుధాకర్ చెప్పా రు. గెలిచిన తరువాత ఒక్కసారే ఆయన మా ఊరికి వచ్చారని గ్రామస్థులంటున్నారు.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో టీడీపీ నేతల భేటీ.. అక్కడ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి