AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే!

Palnadu News: పల్నాడు జిల్లాలో వివాహేతర సంబంధం విషాదాంతమైంది. తనను దూరం పెడుతోందన్న కోపంతో, గతంలో భార్యను హత్య చేసిన బత్తుల గోవిందు, సుజాతను పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో పొడిచి చంపాడు. ఈ దాడిలో సుజాత చిన్నమ్మకు గాయాలయ్యాయి. గోవిందును పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే!
Palnadu News
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 12:50 PM

Share

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి జరిగింది. కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపి పని చేసుకుని జీవించే బత్తుల గోవిందుది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి. గత కొన్నేళ్ళ క్రితం భార్యతో విబేధాల నేపధ్యంలో ఆమెను హత్య చేశాడు. ఈ క్రమంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. నాలుగేళ్ల క్రితం తాపి పనిచేయడానికి వెళ్లిన చోట సుజాత అనే మహిళ పరిచయం అయింది. అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన తమ్మిశెట్టి సుజాత భర్త అమ్మరాజు పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. సుజాతకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె ప్రస్తుతం కొడుకు వద్ద జీవిస్తుంది. అయితే తాపి పనికి వెళ్లిన చోట గోవిందుతో అయిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దీ కాలం పాటు ఈ సంబంధం కొనసాగింది.

అయితే, ఆమె ఏడాదిన్నర క్రితం నుంచి గోవిందును దూరంగా పెట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి గోవిందు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గురువారంనాడు సుజాత తన సోదరుడి కొడుక్కి సంబంధం చూడటానికి వేల్పూరు నుంచి తల్లి గోవిందమ్మ, చిన్నమ్మ పార్వతమ్మతో కలిసి బయలు దేరింది. సుజాత బయల్దేరడాన్ని గమనించిన గోవిందు.. అదే బస్సులో ఎక్కి వాళ్లని ఫాలో అయ్యాడు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద బస్సు దిగిన సుజాత అక్కడే మరో ఆటో ఎక్కుతుండగా ఆమెపై గోవిందు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె వెంటనే కింద పడిపోయింది. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్వతమ్మపై కూడా కత్తి దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కేకలు వేయడంతో పోలీసులు కూడా బయటకు వచ్చారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు దాడి చేసిన అనంతరం అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన గోవిందును స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఏడాదిన్నర నుంచి దూరంగా ఉంటున్న సుజాతను ఎందుకు హత్య చేశాడో పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు. గోవిందు వేల్పూరు ఎందుకు వెళ్లాడు..? అక్కడ నుంచి ఎలా ఫాలో అయ్యాడు.. అతనికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని కోర్టులో హజరుపరచనున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు.

Follow Us