Palnadu SP: పల్నాడు కూడా బీహార్, బెంగాల్ సరసన చేరింది.. పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్‌ కీలక వ్యాఖ్యలు

స్పెషల్ ఆపరేషన్ కౌంటింగ్ డే. ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్యవ్యం అంటూ ప్రకటించారు మల్లికా.

Palnadu SP: పల్నాడు కూడా బీహార్, బెంగాల్ సరసన చేరింది.. పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్‌ కీలక వ్యాఖ్యలు
Sp Malika Garg

Updated on: Jun 01, 2024 | 9:23 AM

మల్లికా గార్గ్.. పల్నాడు ఎస్పీ. ఈమె ముందున్న స్పెషల్ ఆపరేషన్ కౌంటింగ్ డే. ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్యవ్యం అంటూ ప్రకటించారు మల్లికా.

ఇక అప్పటి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎస్పీ. ఫలితాలు ఎలా ఉన్నా సరే అల్లర్లకు దిగకండి, భవిష్యత్‌ పాడు చేసుకోకండి అంటూ సూచిస్తున్నారు. గెలిచిన నేతలు ఐదేళ్లు ఉంటారు, ఓడిన వాళ్ల ఇంటికి వెళ్తారు, మీరెందుకు భవిష్యత్‌ను‌ ఆగం చేసుకుంటారంటూ పదే పదే చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు.

కౌంటింగ్ రోజు సీన్‌ రిపీట్ అయితే ఊరుకునేది లేదు, చిన్న చిన్న తప్పులు చేసినా ఉపేక్షించేది అంటూ హెచ్చరిస్తున్నారు ఎస్పీ. తాను వచ్చాక 160 కేసులు నమోదు చేశాం, 10 రోజుల్లో 1200 మంది మీద యాక్షన్ తీసుకున్నామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. పోలీసులకు సహకరించండి, పల్నాడు పేరు పాడవ్వకుండా చూడండంటూ వివరిస్తున్నారు. పల్నాడుతో ఏపీ పేరు మసకబారుతోంది, ఫలితంగా దేశం పేరు పాడవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఎస్పీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..