Andhra Pradesh: లవ్ సింబల్ లా తాటి చెట్లు.. పల్లెలో ప్రకృతి గీచిన చిత్రం..

పల్లెలంటేనే ప్రేమతో నిండి ఉంటాయి. పల్లెల్లో ఎవరి ఇంటికి వెళ్ళిన ఆప్యాయంగా పాలకరిస్తారు. పల్లెలయంటేనే కల్మషం లేని ప్రాంతాలుగా పిలువబడతాయి...పల్లె ప్రాంతం ప్రేమతో నిండి ఉంటుంది. ఇది చెప్పడానికి ఇక్కడ మా పల్లెలో ఒక అద్భుతమైన విశేషం ఉంది... ఈ తాటి చెట్లు చూడండి... ఇవి ఎటు చూపినా... ప్రేమ చిహ్నం లా కనిపిస్తాయి. మనసు నిండా ప్రేమను, శాంతిని, ఐక్యతను వ్యక్తం చేస్తున్నట్టు ఈ చెట్ల ఆకారాలు మనసుని తాకుతాయి

Andhra Pradesh: లవ్ సింబల్ లా తాటి చెట్లు.. పల్లెలో ప్రకృతి గీచిన చిత్రం..
Love Symbol

Edited By:

Updated on: Oct 15, 2025 | 10:35 AM

ఆంధ్రా ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులో రెండు రాష్ట్రాల ప్రేమను ప్రదర్శి స్తున్నాయి తాటి చెట్లు అనే ఆలోచనలో పడతారు చూపరులు. ఇద్దరి మధ్య ప్రేమ వికాశించడానికి మూరో వ్యక్తి అవసరమైనట్లు ఈ రెండు తాటి ప్రేమకథ మధ్య ప్రేమ వికాశించేందుకు మురో తాటి చెట్టు తోడ్పడినట్లు అనిపిస్తోంది. ఒకరకంగా వర్ణింపబడుతోందని అర్థమవుతుంది. ఇలాంటి చెట్లు ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ లవ్ సింబల్ ఆకారంలోని తాటి చెట్లు వద్దకు వచ్చేవాళ్ళందరికీ ప్రేమకు, సహనానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ఈ వింత తాటి చెట్లు గాలి విస్తున్నపుడు ప్రేమ గీతాల్లా పలకరించటం వంటి అనుభూతి కలిగిస్తాయి. ప్రతి ఆకారంలో ప్రేమ పువ్వులు పండిపోతున్నట్టు తెలుస్తుంది. ఇవి కేవలం చెట్లు కాదని, ప్రేమకు అందమైన ప్రకృతి సమర్పణ అని ఇక్కడి స్థానికుల అభిప్రాయం. ఈ తాటి చెట్లు ప్రేమ చిహ్నంలా ఉంటూ ఇక్కడి వాతావరణానికి హృదయాన్ని కదిలించే ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..