Oxygen Shortage: విజయనగరం మహారాజా ఆసుపత్రిలో విషాదం.. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతి, మరికొందరి పరిస్థితి విషమం

|

Apr 26, 2021 | 8:19 AM

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితులకు ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఇద్దరు కొవిడ్‌ రోగులు ఉపిరాడక కన్నుమూశారు.

Oxygen Shortage: విజయనగరం మహారాజా ఆసుపత్రిలో విషాదం.. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Covid Patients Dies Lack Of Oxygen
Follow us on

Oxygen Shortage in Maharaja Hospital: దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితులకు ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో అర్ధరాత్రి ఆక్సిజన్‌ అందక ఐదుగురు కరోనా బాధితులు చనిపోవడం అందరిని కలిచివేస్తోంది. ఆక్సిజన్ అందకనే ఐదుగురు మృతి చెందినట్లుగా వైద్యాధికారులు ధృవీకరించారు. ఈ విషాదకర ఘటన స్థానిక మహారాజ ప్రభుత్వ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది.

ఆసుపత్రిలోని కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో ఆక్సిజన్‌ కొరతతో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే మిగతా రోగులను ఇతర ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరి కొందరికి అంబులెన్సుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ హాస్పిటల్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. దీంతో ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులతో పాటు రోగుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నప్పటికి ఇప్పటికీ కూడా ఆక్సిజన్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ప్రైవేట్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం రోగుల బంధువుల పరుగులు పెడుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. వార్డుల్లో కరోనా పేషెంట్లు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. తమకు ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న భయం వాళ్లను వెంటాడుతోంది. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు విమర్శలు వస్తున్నాయి. పక్కనే ఉన్న విశాఖ జిల్లా నుంచి దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరా అవుతుంటే ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం.

Read Also.. Lockdown: తమిళనాడులో నేటినుంచి లాక్ డౌన్.. పూర్తిగా మూత పడనున్న షాపింగ్ మాల్స్, థియేటర్లు.. సరిహద్దులో భారీగా నిలిచిన వాహనాలు