AP Weather Report : ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం వరకు విస్తరించింది. సముద్రమట్టానికి 3.1 కిమీ & 7.6 కిమీ మధ్య నైరుతి దిశగా వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న 3 రోజుల్లో ఏపీలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
రేపు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40 కిమీ నుంచి 50 కిమీ వరకు గరిష్టముగా 60 కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40 కిమీ నుంచి 50 కిమీ వరకు గరిష్టముగా 60 కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40కిమీ నుంచి 50కిమీ వరకు గరిష్టముగా 60కిమీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది.
రాయలసీమ : రాయలసీమలో ఈరోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.