Balineni Srinivasa Reddy: అది నా అదృష్టం.. ఇప్పుడు అసెంబ్లీలో తిట్లు తప్ప ఇంకేమున్నాయ్‌.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..

అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది..! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌.. రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.. నేను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి బాలినేని తన ఫ్రెండ్‌ కొడుకని, తాను తప్పుచేయడని చెప్పి వెనకేసుకుని వచ్చారు..

Balineni Srinivasa Reddy: అది నా అదృష్టం.. ఇప్పుడు అసెంబ్లీలో తిట్లు తప్ప ఇంకేమున్నాయ్‌.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Balineni Srinivasa Reddy

Updated on: Feb 19, 2024 | 10:52 AM

అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది..! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌.. రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.. నేను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి బాలినేని తన ఫ్రెండ్‌ కొడుకని, తాను తప్పుచేయడని చెప్పి వెనకేసుకుని వచ్చారు.. కానీ, ఇప్పుడన్నీ ఛండాలమైపోయాయ్‌.. అంటూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఎంపీ మాగుంటతో కలిసి బాలినేని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బాలినేని మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. రోశయ్య సియంగా ఉన్న సమయంలో తాను కేబినెట్‌లో మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి చెప్పారంటూ వివరించారు. ఆ సమయంలో ఆయన తనను కొడుకులాంటి వాడివని తనపై కురిపించిన ఆప్యాయతను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని బాలినేని వ్యాఖ్యానించారు.

తుఫాను విపత్తుల సమయంలో పేదలకు తాను ఆర్డికసాయం చేస్తే వెంటనే రోశయ్య తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు చమత్కారంతో సమాధానం చెబుతారని, ఒక రోజు టీడీపీ నేత జనార్దన్‌రెడ్డిని బియ్యంరెడ్డి అని పిలిచేవారని, బియ్యం కాజేశారన్న ఆరోపణలతో ఆయన్ను ఇమిటేట్‌ చేసేవారని తెలిపారు. అందతా ఫన్నీగా ఉండేదంటూ.. రోశయ్య చేసిన విధంగా హావాభావాలను బాలినేని సభలో ప్రదర్శించారు. బాలినేని మాటలకు.. ఆయన హావభావాలకు సభలో అందరూ సరదగా నవ్వుకున్నారు.

వీడియో చూడండి..

కాగా.. ప్రస్తుత రాజకీయాలు, పరిస్థితులపై వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..